iDreamPost
android-app
ios-app

బుద్దా వెంకన్నకు హైకోర్టు చీవాట్లు

బుద్దా వెంకన్నకు హైకోర్టు చీవాట్లు

అయినదానికీ, కానిదానికీ ప్రభుత్వంపై, వైఎస్సార్‌సీపీపై అవాకులు చవాకులు పేలే టీడీపీ ఎమ్మెల్సీ, కాల్‌మనీ ఫేమ్‌ బుద్దా వెంకన్నకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. మీ రాజకీయాలకు గౌరవప్రదమైన న్యాయస్థానాలను వేదిక చేసుకోవడం మానుకోవాలంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. అసలు విషయం ఏంటంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదంటూ బుద్దా వెంకన్న ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుద్దాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

“అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుంటే.. బాధితులు కోర్టుకు రావాలిగానీ, మీరెలా పిటిషన్‌ దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ప్రతి చిన్న విషయానికి న్యాయస్థానానికి రావడం మానుకోవాలని సూచించింది. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోతే సంబంధిత ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయాలి గానీ.. ఏకంగా హైకోర్టుకు రావడమేంటని ప్రశ్నించింది. ఈ కేసులో ఎలాంటి వాదన వినే ప్రసక్తే లేదని, ఈ వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రాజకీయాలకు కోర్టులు వేదిక కాదని స్పష్టం చేసింది హైకోర్టు”.

తెలుగుదేశం హయాంలో విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ తీవ్ర సంచలన విషయం కలిగించిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారంలో ప్రధానంగా బుద్దా వెంకన్నపై ఆరోపణలున్నాయి. ఆసరా లేని మహిళలకు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి.. వాటిని వసూలు చేసుకునే క్రమంలో మహిళలను వాడుకునే దందా టీడీపీ హయాంలో జోరుగా సాగింది. వందలాది మంది మహిళలు ఈ ముఠా బారిన పడి ఇబ్బందులు పడ్డారు. ఈ వ్యవహారంపై వందలాది కేసులు నమోదయ్యాయి. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం వీటని తొక్కిపెట్టింది. కాల్‌మీనీ ఘటనలు సొంత పార్టీ నేతలకు కూడా విసుగు తెప్పించాయి. అందుకే ఇటీవల ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని కూడా బుద్దా వెంకన్నపై పరోక్షంగా విమర్శలు చేశారు. కాల్‌మనీ గాళ్లకు, గుళ్లో కొబ్బరి చిప్పల దొంగలకి, సైకిల్‌ బెళ్లుల దొంగలకి, సెక్స్‌ రాకెట్‌ గాళ్లకి, బ్రోకర్లకి రాజకీయ జన్మలు, పునర్జన్మలు అవసరమేమోగానీ నాకు అవసరం లేదంటూ చేసిన ఘాటు ట్వీటు అప్పట్లో తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

కాగా, చంద్రబాబు ప్రధాన అనుచరుడిగా ఉంటూ.. విపక్ష పార్టీలపై నోటికి వచ్చినట్లు మాట్లాడే స్వభావం బుద్దా వెంకన్నది. తన స్థాయిని మరిచి మాట్లాడుతూ ఉంటారు. మొన్న బోండా ఉమతో కలసి మాచర్లకి వెళ్లి రౌడీయిజం చేయాలని చూస్తే అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయడంతో పారిపోయి విజయవాడ వచ్చారు.