iDreamPost
android-app
ios-app

లైగర్ ని ఇరకాటంలో పెడతారా

  • Published Mar 03, 2020 | 5:15 AM Updated Updated Mar 03, 2020 | 5:15 AM
  • Published Mar 03, 2020 | 5:15 AMUpdated Mar 03, 2020 | 5:15 AM
లైగర్ ని ఇరకాటంలో పెడతారా

బయటికి పెద్దగా కనిపించడం లేదు కానీ విజయ్ దేవరకొండ లేటెస్ట్ డిజాస్టర్ వరల్డ్ ఫేమస్ లవర్ ఇటు బయ్యర్లకు అటు నిర్మాత కెఎస్ రామారావుకు నష్టాల పరంగా చుక్కలు చూపించేసింది. హీరో రెమ్యునరేషన్ లో కొంత వెనక్కు ఇస్తే మీకు సర్దుబాటు చేస్తానని డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్ హామీ ఇచ్చాడన్న వార్త ఇప్పటికే ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు విజయ్ మాత్రం ఇదేదీ పట్టించుకోకుండా హ్యాపీగా ముంబైలో లైగర్ షూటింగ్ చేసుకుంటూ యమా బిజీగా ఉంటున్నాడు. హీరోయిన్ అనన్య పాండేతో తీసుకున్న స్టిల్స్ ఇప్పటికే లీకుల రూపంలో సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.

విజయ్ దేవరకొండ మార్కెట్ ని వరల్డ్ ఫేమస్ లవర్ బాగా డ్యామేజ్ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు లైగర్ సైతం ముందు పూరి జగన్నాధ్ బ్రాండ్ మీదే మార్కెట్ అవ్వాలి. అయితే తమను పట్టించుకోని కారణంగా ఈ హీరో నటించిన సినిమా కాబట్టి లైగర్ బిజినెస్ టైంలో ఇబ్బందులు సృష్టించే దిశగా పంపిణిదారులు ఉన్నట్టు వస్తున్న వార్తలు అభిమానులను టెన్షన్ లో పెడుతున్నాయి. నిజానికి ఇలాంటి ఘోరమైన ఫలితాలను అందుకున్నప్పుడు హీరోలు దర్శకులు ఎంతో కొంత నష్టాలు సర్దుబాటు చేయడం మాములే.

అప్పుడెప్పుడో బాబా టైంలో రజనీకాంత్ ఇదే పద్ధతిని అనుసరించాడు. లింగాకు కూడా ఈ బాధ తప్పలేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసికి త్రివిక్రమ్ తో కలిసి కొంత డ్యామేజ్ కంట్రోల్ చేశాడు. అయితే ఇలా అందరు హీరోలు చేశారని కాదు. వసూళ్ల లెక్కలు భారీగా తేడా వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ఊరడించే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం నిజమే అయితే లైగర్ ఎంతో కొంత ఇబ్బందులు పడటం ఖాయం. ఇస్మార్ట్ శంకర్ తో పూరి కంబ్యాక్ అయ్యాడు కానీ విజయ్ దేవరకొండకు చాలా అర్జెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్టు పడాలి. మరి లైగర్ వ్యవహారం ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom