iDreamPost
android-app
ios-app

సారీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ – అఫీషియల్

  • Published May 18, 2020 | 8:31 AM Updated Updated May 18, 2020 | 8:31 AM
  • Published May 18, 2020 | 8:31 AMUpdated May 18, 2020 | 8:31 AM
సారీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ – అఫీషియల్

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గత నెలలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ ఎంట్రీని వీడియో టీజర్ రూపంలో ఇచ్చి అభిమానులను ఖుషి చేసిన ఆర్ఆర్ఆర్ యూనిట్ ఎల్లుండి రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డేకి మాత్రం షాక్ ఇచ్చింది. మే 20న ఎలాంటి ఫస్ట్ లుక్ కానీ వీడియో కానీ విడుదల చేయడం లేదని అఫీషియల్ గా చెప్పేసింది. ఏదో మొక్కుబడిగా ఇవ్వడం ఇష్టం లేదని ఫ్యాన్స్ ఏదైతే ఆశిస్తారో దాన్ని బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం లాక్ డౌన్ వల్ల ముందుకు సాగలేదని అందుకే ఏదీ ఆశించొద్దని చెప్పేశారు. సో తారక్ తో పాటు మూవీ లవర్స్ కు డిజప్పాయింట్మెంట్ తప్పలేదు.

యంగ్ టైగర్ ని తెరమీద చూసి రెండేళ్లు దాటింది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత పూర్తిగా ఆర్ఆర్ఆర్ కు అంకితమైపోయిన తారక్ అటుఇటుగా మూడేళ్ళ గ్యాప్ తెచ్చేసుకున్నాడు. దీని ఆలస్యానికి సవాలక్ష కారణాలు అడ్డం పడుతున్నాయి. అని సర్దుకుంటున్నాయి అనుకుంటున్న తరుణంలో కరోనా రూపంలో ఏకంగా మూడు నెలలకు పైగా బ్రేక్ పడటం పెద్ద దెబ్బె. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న త్రివిక్రమ్ సినిమా తాలూకు టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ రావొచ్చనే అంచనాలో అభిమానులు ఉన్నారు. అయితే హారికా హాసిని బ్యానర్ కాబట్టి ఖచ్చితంగా వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం.

యూనిట్ నుంచి వస్తున్న లీక్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. అయినా ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ వాయిస్ లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర పరిచయాన్ని ఎంజాయ్ చేయాలనుకున్న మూవీ లవర్స్ మాత్రం ఈ ప్రకటన పట్ల నిరాశగా ఉన్నారు. ఇంతకీ ఆర్ఆర్ఆర్ వచ్చే జనవరి 8 విడుదల అవుతుందా లేదా అనేది డివివి సంస్థ అధికారికంగా ట్వీట్ చేయలేదు. ఇంటర్వ్యూ టాక్ లో దానయ్య ఛాన్స్ లేదన్నట్టుగానే చెప్పేశారు. బాహుబలి తర్వాత వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేసి పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఇద్దామనుకున్న రాజమౌళి ఆశలకు బ్రేక్ పడింది. ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ వీడియో ఎదురుచూపులకు కూడా కళ్లెం తప్పలేదు. ఏ ఆగస్ట్ 15 లేదా దసరా పండగ దాకా ఆ టీజర్ కోసం వెయిట్ చేయాల్సిందే

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş