iDreamPost
iDreamPost
అయ్యయ్యో బ్రహ్మయ్య ఇలా చేశావేమిటయ్యా అని పాడుతున్నారు టాలీవుడ్ నిర్మాతలు . చిన్నా పెద్ద తేడా లేకుండా అందరి మీద కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. సినిమా పరిశ్రమ దీని వల్ల ఏ స్థాయిలో అతలాకుతలం అయ్యిందో, ఎంత నష్టం మిగల్చబోతోందో ఊహకు కూడా అందటం లేదు. ఇదిలా ఉండగా అగ్ర నిర్మాతలకు దీని సెగ మాములుగా తగలడం లేదు. ముఖ్యంగా దిల్ రాజు లాంటి వాళ్ళకు మరీనూ. నాని వి విడుదలతో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ వాయిదా పడటం చాలా రకాలుగా దెబ్బ కొడుతోంది. ఇది ప్రపంచమంతా ఉన్న పరిస్థితి కాబట్టి ఎవరేమి చేయలేరు కాని కరోనా గొడవ సద్దుమణిగాక ఇవన్ని ఎలా రీ స్టార్ట్ అవుతాయన్నదే ఆసక్తికరంగా మారింది.
వకీల్ సాబ్ కేవలం పాతిక శాతం మాత్రమే షూట్ బాలన్స్ ఉందని ఇన్ సైడ్ టాక్. అందులోనూ శృతి హసన్ పాల్గొనాల్సిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అందులో ముఖ్యమైంది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే నెల లోపే పూర్తి చేయొచ్చు. కాని పవన్ నుంచి అంత సహకారం ఉంటుందా అనేదే ప్రశ్న. మే రిలీజ్ ఎలాగూ సాధ్యం కాదు. పోనీ జూలై ఆఖరుకు అనుకుంటే ఇప్పుడు వచ్చే నెల వీలైనంత వేగంగా షూటింగ్ కంప్లీట్ చేయాలి. పోనీ అది సాధ్యపడదు అనుకుంటే ఆగస్ట్ 15ని టార్గెట్ చేసుకోవాచ్చు. కంటెంట్ పరంగా కనెక్ట్ ఆయ్యే డేట్ కూడా.
ఒకవేళ ఇదీ మిస్ అయితే దసరాకు వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కాని అప్పుడు కెజిఎఫ్ 2 కాపు కాసి ఉంది. ఇక్కడ ఎంత పవర్ స్టార్ అయినా పక్క రాష్ట్రాల్లో రీమేక్ సబ్జెక్టుతో కెజిఎఫ్ 2తో పోటీ పడే సీన్ వకీల్ సాబ్ కు ఉండకపోవచ్చు. అది రిస్క్ కూడా. కాబట్టి దసరా ముందే వచ్చేయాలి. ఎలాగూ ఆచార్య రిలీజయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి కాబట్టి వకీల్ సాబ్ ఆ అవకాశాన్ని వాడుకోవాలి. వీలైనంత త్వరగా రావడం బెటర్. థియేటర్లకు జనం రావాలంటే పెద్ద స్టార్ హీరో సినిమా విడుదల ఇప్పుడు చాలా అవసరం. పవన్ లాంటి రేంజ్ ఉన్న స్టార్ అయితే అభిమానులు తండోపతండాలుగా వస్తారు. మరి వకీల్ సాబ్ ఏం చేస్తాడో వేచి చూడాలి