ధోనీ ఓటు – కాంగ్రెస్ జేఎంఎం హెలికాఫ్టర్ షాట్

  • Published - 01:57 PM, Mon - 23 December 19
ధోనీ ఓటు – కాంగ్రెస్ జేఎంఎం హెలికాఫ్టర్ షాట్

డిసెంబర్ 23,2005 ఈరోజుకో ప్రత్యేకత ఉంది జార్ఖండ్ డైనమైట్ గా పేరుగాంచిన ధోని అంతర్జాతీయ వన్డేలలో అరంగేట్రం చేసిన రోజిది. బంగ్లాదేశ్ తో జరిగిన ఆ వన్డేలో ధోని అనవసర పరుగుకోసం ప్రయత్నించి డక్ అవుట్ గా వెనుదిరిగాడు కానీ తరువాతి రోజుల్లో హెలికాఫ్టర్ షాట్ల అనేక రికార్డ్స్ సాధించటంతోపాటు భారత్ కు ప్రపంచ కప్పుతో పాటు ఎన్నో విజయాలు సాధించిపెట్టాడు.

యాధృచ్చికంగా జరిగింది లేక వేరే కారణాలతోనే కానీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగిడిన తరువాత ధోనీ సొంత రాష్ట్రం జార్ఖండ్ ఎన్నికలలో ఏ ఒక్కసారి కూడా ఓటు వేసింది లేదు. ఇప్పుడు వన్డేల నుంచి రిటైర్ కావటం వలన కొంచం ఖాళి దొరికినట్లుంది ఈ ఎన్నికల్లో ఓటు వేశాడు.

యాదృచ్చికంగా ధోనీ కెరీర్ మొదలైన రోజే అంటే డిసెంబర్ 23,2019న జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వడం కాంగ్రెస్, జేఎంఎం కూటమి హెలికాఫ్టర్ షా(సీ)ట్లకు బీజేపీ చేతులెత్తేసింది. బీజేపీ టీమ్ కెప్టెన్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కూడా సొంత నియోజకవర్గంలో ఓడిపోయాడు… ధోని ఏపార్టీకి ఓటేసాడో కానీ ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ లాగా ఉత్కంఠతతో మొదలైన కౌంటింగ్ చివరికి కాంగ్రెస్-జేఎంఎం ఇన్నింగ్స్ తేడా విజయంతో ముగిసింది.

Show comments