iDreamPost
android-app
ios-app

జమ్మూకశ్మీర్‌లో BJP ఎందుకు ఓటమి పాలైంది? ఈ తప్పు వల్లేనా?

  • Published Oct 09, 2024 | 10:20 AM Updated Updated Oct 09, 2024 | 10:20 AM

Jammu Kashmir, Assembly Election 2024, BJP: ఈ సారి ఎలాగైన అధికారంలోకి వస్తామని బలంగా నమ్మకం పెట్టుకున్న రాష్ట్రంలో బీజేపీ బొక్కబోర్లా పడింది. మరి ఆ పార్టీకి జమ్మూకశ్మీర్‌లో ఓటమి ఎందుకు ఎదురైందో ఇప్పుడు తెలుసుకుందాం..

Jammu Kashmir, Assembly Election 2024, BJP: ఈ సారి ఎలాగైన అధికారంలోకి వస్తామని బలంగా నమ్మకం పెట్టుకున్న రాష్ట్రంలో బీజేపీ బొక్కబోర్లా పడింది. మరి ఆ పార్టీకి జమ్మూకశ్మీర్‌లో ఓటమి ఎందుకు ఎదురైందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Oct 09, 2024 | 10:20 AMUpdated Oct 09, 2024 | 10:20 AM
జమ్మూకశ్మీర్‌లో BJP ఎందుకు ఓటమి పాలైంది? ఈ తప్పు వల్లేనా?

ఇండియాలో జమ్మూకశ్మీర్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మంగళవారం.. వాటికి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి సత్తా చాటింది. ఎన్నికల​ కంటే ముందు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం వారికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. కానీ, జమ్మూకశ్మీర్‌పై బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఎలాగైన ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చాలా బలంగా కోరుకుంది.. అందుకోసం ఎంతో కష్టపడింది కూడా. అయినా కానీ, కశ్మీర్‌ ప్రజలు.. నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమి వైపే నిలవడం విశేషం. మరి జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది. అందుకు ఏ అంశాలు కారణంగా నిలిచాయో ఇప్పుడు చూద్దాం..

జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం ఉందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. వాటికి తగ్గట్లుగానే ఫలితాలు కూడా వచ్చాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమి 50కి పైగా స్థానాల్లో గెలిచింది. జమ్మూ కశ్మీర్‌లో 20 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరిగింది. ఈ కౌంటింగ్‌ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 90 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే.. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా నిలిచింది మాత్రం పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అంశమే. ఇటు కాంగ్రెస్‌-నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి, అటు బీజేపీ కూడా ఈ అంశాన్నే తమ ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకున్నాయి.

ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను సాధిస్తామని కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి హామీ ఇచ్చింది. అటు బీజేపీ కూడా జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని ప్రచారం చేసింది. ఆ హోదా ఇవ్వగలిగే పార్టీ ఒక్క బీజేపీనే అని ప్రచారం హోరెత్తించింది. కానీ, ఆ ప్రచారం ఓటు రూపంలో మాత్రం కన్వె కాలేదు. జనం కాంగ్రెస్‌ కూటమి వైపే నిలబడ్డారు. కాంగ్రెస్ కశ్మీర్‌లో 7 స్థానాలు, జమ్మూలోని 25 స్థానాల్లో పోటీ చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ కశ్మీర్‌లో 51 సీట్లు, జమ్మూలో 32 సీట్లలో పోటీ చేసింది. బీజేపీ మాత్రం ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీలోకి దిగినా.. మెరుగైన స్థానాలే సాధించని చెప్పవచ్చు. ఒంటరిగా పోటీ చేసి.. కూటమికి గట్టి పోటీ ఇచ్చింది. అంతిమంగా మెజార్టీ స్థానాలే అధికారాన్ని డిసైడ్‌ చేస్తాయి కనుక కాంగ్రెస్‌-నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు కూర్చి దక్కింది.

అయితే.. కమ్మూకశ్మీర్‌లో బీజేపీ ఓటమికి ప్రధానంగా ఆ పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకత కారణమైంది. ఎందుకంటే.. ఇక్కడ రెండు పార్టీలు కూడా ఒక అంశాన్ని ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకున్నా.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చే అవకాశం ఆ పార్టీకే ఉన్నా కూడా ప్రజలను వారిని నమ్మలేదు. ఒంటరిగా పోటీలో నిలవడం కూడా ఇక్కడ బీజేపీ వేసిన ఒక రాంగ్‌ స్టెప్‌ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితాలపై బీజేపీ పెద్దలు కూడా షాక్‌ అవుతున్నారు. నిజానికి వాళ్లు అక్కడ అధికారం కచ్చితంగా దక్కుతుందని అనుకున్నారు.. కానీ, ఫలితాలు వారి అంచనాలను తారుమారు చేశాయి. కానీ, ఒంటరిగా పోటీ చేసి కూడా చెప్పొకోదగ్గ సీట్లు రావడంతో కాస్త ఉపశమనంగా భావించవచ్చు. మరి జమ్మూకశ్మీర్‌లో బీజేపీకి అధికారం దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.