600 దాటిన కరోనా కేసులు.. కర్నూలు జిల్లాలో అత్యధికం..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 618 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 31 మందికి వైరస్ సోకింది.దీనితో ఈ సంఖ్య 600 దాటింది. కృష్ణా జిల్లాలో ఈ ఒక్కరోజే 18 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారి నుంచి 57 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 546 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 129 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో126 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 70 , నెల్లూరు జిల్లాలో 67 ప్రకాశం జిల్లాలో 44, కడప జిల్లాలో 37, పశ్చిమగోదావరి జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 30, అనంతపురం జిల్లాలో 26, విశాఖ జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 19 కేసులు చొప్పున నమోదయ్యాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నియంత్రణ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. వైరస్ నియంత్రణకు గరిష్టంగా నిర్ధారణ పరీక్షలు చేయాలనే లక్ష్యంతో దక్షిణకొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకుంది.

కరోనా వైరస్ లింకు ను కట్ చేసేందుకు గరిష్టంగా నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా జగన్ సర్కార్ దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. రెడ్ జోన్ ఏరియాలలో ప్రజలకు ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. వచ్చే నెల 3వ తేదీతో లాక్ డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ లోపు రాష్ట్రంలో కరీనా పూర్తిస్థాయిలో కట్టడి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది.

Show comments