iDreamPost
android-app
ios-app

వకీల్ సాబ్ లో ‘బద్రి’ కనెక్షన్

  • Published Mar 04, 2020 | 8:29 AM Updated Updated Mar 04, 2020 | 8:29 AM
  • Published Mar 04, 2020 | 8:29 AMUpdated Mar 04, 2020 | 8:29 AM
వకీల్ సాబ్ లో ‘బద్రి’  కనెక్షన్

20 సంవత్సరాల క్రితం వచ్చిన బద్రి సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోగలరా. ముఖ్యంగా అందులో పవన్ కళ్యాణ్ స్టైల్, మ్యానరిజంస్ కు ఫిదా కానీ వాళ్ళు లేరు. క్లైమాక్స్ కు ముందు విలన్ ప్రకాష్ రాజ్ తో చెప్పే ‘నువ్వు నందా అయితే ఏంటి నేను బద్రి, బద్రినాథ్’ అంటూ పేల్చే డైలాగ్ ఓ రేంజ్ లో వెళ్ళింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంలో ఇలాంటి సీన్లు చాలా దోహదపడ్డాయన్న మాట వాస్తవం. ఆ తర్వాత ప్రకాష్ రాజ్-పవన్ కళ్యాణ్ కలిసి నటించారు కానీ అంత ఇంపాక్ట్ ఇంకేదీ చూపించలేకపోయింది.

తాజా అప్ డేట్ ప్రకారం వకీల్ సాబ్ లో ఆ అవకాశం మరోసారి కలగనుంది. పింక్ రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో అధిక శాతం కోర్ట్ లో జరుగుతుందన్న సంగతి తెలిసిందే. బాధితులైన ముగ్గురు అమ్మాయిల తరఫున వాదించే వకీల్ గా పవన్ కళ్యాణ్ ఇతనికి ధీటుగా నిందితుల సైడ్ వకాల్తా పుచ్చుకున్న లాయర్ గా ప్రకాష్ రాజ్ ల మధ్య జరిగే ఆర్గుమెంట్స్ లో ఓ రేంజ్ లో ఉంటాయని తెలిసింది. సై అంటే సై అంటూ సవాల్ చేసుకునే రేంజ్ లో ఈ సీన్స్ ని వేణు శ్రీరామ్ షూట్ చేసినట్టుగా తెలిసింది. పవన్ కళ్యాణ్ హై వోల్టేజ్ డ్రామా ఎప్పుడూ ట్రై చేయలేదు. వకీల్ సాబ్ లో ఉన్నది ఇదే.

ఒకే కోర్ట్ రూమ్ లో చాలా సన్నివేశాలు ఉంటాయి. అన్ని కూడా హీరో తన వాదనను బలంగా వినిపించే దాని మీద ఎక్కువ ఫోకస్ కలిగి ఉంటాయి. అందుకే చాలా గ్రిప్పింగ్ గా ఇవి తీర్చిదిద్దుతున్నట్టు తెలిసింది. ఈ ఎపిసోడ్స్ కనక అంచనాలకు తగ్గట్టు వస్తే బద్రిని మించిన రేంజ్ లో డైలాగ్ వార్ ని వకీల్ సాబ్ లో చూడొచ్చు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ ఆడియో సింగల్ ని అతి త్వరలో విడుదల చేయబోతున్నారు. మేలో రిలీజ్ కానున్న వకీల్ సాబ్ మీద ఇప్పటికే అంచనాలు హెవీగా ఉన్నాయి. నివేదా థామస్ కీలక పాత్ర పోషిస్తున్న వకీల్ సాబ్ లో సెకండ్ హాఫ్ లో పవన్-ప్రకాష్ రాజ్ ల మధ్య ట్రాక్ ఉంటుంది. చూద్దాం ఎలా రాబోతోందో

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio