iDreamPost
android-app
ios-app

నాన్న‌కు ప్రేమ‌తో.. జ‌గ‌న్..!

  • Published Jun 21, 2020 | 5:38 PM Updated Updated Jun 21, 2020 | 5:38 PM
  • Published Jun 21, 2020 | 5:38 PMUpdated Jun 21, 2020 | 5:38 PM
నాన్న‌కు ప్రేమ‌తో.. జ‌గ‌న్..!

ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. భావోద్వేగ ట్వీట్ చేశారు. త‌న తండ్రి వైఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డిని త‌లుచుకుంటూ.. తండ్రులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. నాన్నే నా బ‌లం.. నాకు ఇన్ స్పిరేష‌న్ అన్నారు. తండ్రులంద‌రూ త‌మ పిల్ల‌ల విజ‌యానికి కృషి చేస్తారు.. విజ‌యం వైపు వారిని న‌డిపిస్తారు.. కావాల్సినంత మ‌ద్ద‌తు ఇస్తారు. ప్రేమ పంచుతారు. నాన్నే మ‌న‌కు మొద‌టి స్నేహితుడు.. గురువు.. మ‌న హీరో.. వారితో మ‌నం చాలా విలువైన క్ష‌ణాలు పంచుకుంటాము.. గొప్ప తండ్రులంద‌రికీ ఫాద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు.. అంటూ ట్విట్ట‌‌ర్ లో పోస్ట్ చేశారు. త‌న తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డితో ఉన్న ఫొటోను దానికి జ‌త చేశారు.

ఇత‌ర రంగాల్లోని కొంద‌రు ప్ర‌ముఖులు కూడా.. త‌మ తండ్రుల‌కు ఫాద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రేమ‌, ద‌య‌, క‌రుణ‌, ధృడ‌మైన‌, సున్నిత‌మైన వంటి ప‌దాలు నా తండ్రితో నాకున్న అనుబంధాన్ని వివ‌రిస్తాయి. నాన్న నాకు పంచిన ప్రేమ‌ను, మాతో మెలిగిన విధంగానే.. నేను నా పిల్ల‌ల‌తో అదే అనుబంధాన్ని కొన‌సాగిస్తాను. హ్యాపీ ఫాద‌ర్స్ డే నాన్న‌.. నేను ఎప్పుడూ మీరు చూపిన దారిలోనే న‌డుస్తాను.. అంటూ సినీ హీరో మ‌హేష్ బాబు ట్వీట్ చేశారు..

కొన్ని బంధాలను నిర్వ‌చించ‌లేం.. హ్యాపీ ఫాద‌ర్స్ డే అంటూ మ‌రో హీరో రామ్ చ‌ర‌ణ్ కూడా త‌న చిన్న‌త‌నంలోను, ప్ర‌స్తుతం త‌న తండ్రి చిరంజీవితో ఉన్న ఫొటోల‌ను షేర్ చేశారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet