దేశం మొత్తాన్ని కుదిపేసిన “జై భీమ్” సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల జరిగిన 12వ బీజింగ్ ఫిలిమ్ ఫెస్టివల్ (12th Beijing Film Festival)లో సినిమా చూసినవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు. సినిమా అయిపోగానే లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ట్విట్టర్ లో దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.
If the world becomes more aware of atrocities on Dalits and Adivasi through films like #Jaibhim then it would be better pic.twitter.com/M6hGxKvmFf
— Ravi Ratan (@scribe_it) August 20, 2022
“ఎల్లలు దాటిన అభిమానం” అంటూ హీరో సూర్య ట్విట్టర్ లో తన సంతోషాన్ని పంచుకున్నాడు.
#JaiBhim Ruling beyond boundaries #VaadiVaasal #EtharkkumThunindhavan pic.twitter.com/VBOe6etZO7
— SURIYA 360° (@SURIYA__360) August 19, 2022
బీజింగ్ ఫిలిమ్ ఫెస్టివల్ లో భాగంగా ప్రదానం చేసే టియాన్టన్ అవార్డుకి (Tiantan Award 2022) “జై భీమ్” నామినేట్ కూడా అయింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రిలిమినరీ నామినేషన్స్ దాకా వెళ్ళింది. ఇక IMDB చార్టులో ఈ సినిమా 9.6 రేటింగ్ సాధించింది. ఇది ప్రసిద్ధ “షాషంక్ రిడెంప్షన్” (Shawshank Redemption) సాధించిన దాని కంటే ఎక్కువ.