iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. సూర్య ‘కంగువా’ మూవీ ఎడిటర్ అనుమానాస్పద మృతి

  • Published Oct 30, 2024 | 10:24 AM Updated Updated Oct 30, 2024 | 10:29 AM

Kanguva Movie: గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు కారణాలతో సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూస్తున్నారు.

Kanguva Movie: గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు కారణాలతో సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూస్తున్నారు.

  • Published Oct 30, 2024 | 10:24 AMUpdated Oct 30, 2024 | 10:29 AM
ఇండస్ట్రీలో విషాదం..  సూర్య ‘కంగువా’ మూవీ ఎడిటర్ అనుమానాస్పద మృతి

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర రంగాలకు చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. ఇందులో చాలా వరుకు వయోబారం, అనారోగ్య సమస్యలు, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు కాగా మరికొన్ని అనుమానాస్పద మరణాలు. సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. ఇటీవల ఆదిపురుష్ నటి ఆశావర్మ, నిర్మల్ బెన్ని, బిజిల్ రమేష్, వికాస్ సేథీ, తమిళ ప్రొడ్యూసర్ ఢిల్లీ బాబు, నటి సీఐడీ శకుంతల నెలల వ్యవధిలోనే కన్నుమూశారు. తాజాగా సూర్య హీరోగా నటిన్న ‘కంగువా’సినిమా ఎడిటర్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియాగా రూపొందుతున్న మూవీ ‘కంగువా’. ఈ మూవీకి పని చేసిన ప్రముఖ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ (43)కన్నుమూశారు. కేరళాలోని పనమ్పిల్లీ నగర్ లోని తన అపార్ట్ మెంట్ లో ఆయన మరణించారు. అయితే యూసుఫ్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. అందుకే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆయన మరణించి ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత నిషాద్ మృతదేహాన్ని ఎర్నాకులం జనరల్ ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు. తమిళ్ ఇండస్ట్రీలో నిషాద్ యూసుఫ్ ఎడిటర్ గా ఎంతో మంచి పేరు ఉంది.

సినిమాలపై ఫ్యాషన్ తో చిన్న వయసులోనే ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. చావెర్​, ఉండా, థల్లుమాలా, సౌదీ వెళ్లాక, వన్​, ఆపరేషన్ జావా వంటి హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. ఆయన చివరిగా బజూక, కంగువా మూవీస్ కి ఎడిటర్ గా వ్యవహరించారు. 2022లో థల్లుమాల్లా మూవీకి గాను నిషాద్ కి బెస్ట్ ఎడిటర్ గా అవార్డు వచ్చింది. ఎడిటర్ గా తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో యూసుఫ్ కి ఎంతో మంచి పేరు ఉంది.యూసుఫ్  ఎడిటర్ గా వర్క్ చేసిన చివరి చిత్రాలు మమ్ముట్టి నటించిన బజూక, సూర్య నటించిన కంగువ త్వరలో రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఎవరైనా గిట్టని వారు చేసిన పనా? లేక డిప్రేషన్ తో తనకు తానే బలవన్మరణానికి పాల్పపడ్డాడా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. నిషాద్ స్వస్థలం చంగనస్సేరి. తన భార్య, పిల్లలతో కలిసి కొచ్చిలోని పనంబిల్లి నగర్ లో నివాసం ఉంటున్నాడు. నిషాద్ యుసుఫ్ మరణవార్త విని సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులు ఆయన నివాళులర్పిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కంగువాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం కంగువా. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.350 కోట్లకు పైమాటే అని ఇండస్ట్రీ టాక్. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు మూవీస్ చేసిన శివ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. టైమ్ ట్రావెల్ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పదికి పైగా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి సెన్సార్ వాళ్లు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. నవంబర్‌ 14న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సూర్య అండ్ టీమ్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nishadh Yusuf♒🦋 (@nishadhyusuf)

Jojobet GirişmeritbetmeritbetcasibomMarsbahis girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/