iDreamPost
android-app
ios-app

Kanguva Trailer: కంగువ ట్రైలర్.. మేకర్స్ ఆ విషయాన్ని ప్రేక్షకుల నుంచి దాచారా?

  • Published Aug 13, 2024 | 3:35 PM Updated Updated Aug 13, 2024 | 3:35 PM

సూర్య కంగువ మూవీ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో ఓ విషయాన్ని మేకర్స్ ప్రేక్షకులకు తెలీకుండా దాచినట్లు అనిపిస్తోంది. ఇది మేకర్స్ కావాలనే చేశారా? లేక అలా జరిగిపోయిందా? అన్నది తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సూర్య కంగువ మూవీ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో ఓ విషయాన్ని మేకర్స్ ప్రేక్షకులకు తెలీకుండా దాచినట్లు అనిపిస్తోంది. ఇది మేకర్స్ కావాలనే చేశారా? లేక అలా జరిగిపోయిందా? అన్నది తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Kanguva Trailer: కంగువ ట్రైలర్.. మేకర్స్ ఆ విషయాన్ని ప్రేక్షకుల నుంచి దాచారా?

కోలీవుడ్ స్టార్ సూర్య, శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘కంగువ’. పాన్ ఇండియా రేంజ్ లో దాదాపు రూ.350 కోట్లతో ఈ ఈ మూవీ రూపొందుతోంది. 10 భాషల్లో రిలీజ్ కానుంది. ఇక సోమవారం రిలీజ్ అయిన ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ వచ్చాయి. వేరే ప్రపంచంలోకి డైరెక్టర్ తీసుకెళ్లాడు. అయితే ఓ విషయంలో ప్రేక్షకులు కన్ఫ్యూజన్ లో పడ్డారు. మేకర్స్ తప్పు చేశారా? లేక కావాలనే దాచారా? అన్నది తెలియడం లేదు. ఇంతకీ ఆ విషయం ఏంటి? తెలుసుకుందాం పదండి.

కంగువ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. ఇప్పటికే 20  మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది తమిళ్ ట్రైలర్. ఇక ఇందులో ట్రైబర్ వారియర్ గా సూర్య తన నట విశ్వరూపం చూపించాడు. మరో తెగ నాయకుడిగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోన్ ను చూపించారు. రెండు తెగల మధ్య ఆధిపత్య పోరునే ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేశాడు డైరెక్టర్. విజువల్ పరంగా కంటెంట్ పరంగా కంగువ ట్రైలర్ పిచ్చెక్కించింది. అదీకాక దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజ్ అదిరిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఓ విషయంలో మేకర్స్ తప్పు చేశారని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు.

KAnguva

కంగువ మూవీని టైం ట్రావెల్ బేస్డ్ గా తెరకెక్కించాని గతంలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. దానికి తోడు డైరెక్టర్ శివ కూడా ఈ చిత్రం గతం, వర్తమానం కలగలసిన మూవీగా చెప్పుకొచ్చాడు. నిర్మాత కూడా ఈ సినిమా ప్రజెంట్ స్టోరీ గోవా నేపథ్యంలో ఉంటుందని తెలిపాడు. దాంతో రెండు రకాల టైమ్ లైన్స్ కథను డైరెక్టర్ ఎలా చెబుతాడా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా రెండు విభిన్నమైన కాలాల్లో సూర్య ఎలా కనిపిస్తాడా? అని ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే ట్రైలర్ లో మాత్రం మేకర్స్ ఎక్కడా కూడా వర్తమానానికి సంబంధించిన సీన్లను చూపించలేదు. కేవలం గతానికి సంబంధించిన ఫారెస్ట్ సీన్లనే మెుత్తం చూపించారు.

కాగా.. ట్రైలర్ లో ఒక కథను చూపించి.. సినిమాలో ఇంకో స్టోరీని యాడ్ చేస్తే.. ఆడియెన్స్ కనెక్ట్ కాకపోవచ్చు అన్నది కొందరి వాదన. వర్తమానానికి సంబంధించిన కొన్ని సీన్స్ చూపించాల్సిందని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మేకర్స్ ఇలా కావాలనే ఆ సీన్స్ ను చూపించలేదా? లేక అది పార్ట్ 2లో భాగమా? అన్నదానిపై క్లారిటీ రావాల్సింది ఉంది. అదీకాక డైరెక్ట్ థియేటర్లలోనే వర్తమానానికి సంబంధించిన కథను చూపిస్తే.. ఆడియెన్స్ థ్రిల్ అవుతారు అన్న భావన కూడా చిత్ర యూనిట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.