iDreamPost
android-app
ios-app

Kanguva Trailer: కంగువ ట్రైలర్.. సూర్య యాక్టింగ్ కు థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

  • Published Aug 12, 2024 | 1:30 PM Updated Updated Aug 12, 2024 | 1:30 PM

సూర్య నటించిన 'కంగువ' మూవీ అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో రెండు నెలల ముందే ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

సూర్య నటించిన 'కంగువ' మూవీ అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో రెండు నెలల ముందే ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

  • Published Aug 12, 2024 | 1:30 PMUpdated Aug 12, 2024 | 1:30 PM
Kanguva Trailer: కంగువ ట్రైలర్.. సూర్య యాక్టింగ్ కు థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

కంగువ.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్ లో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్. పాన్ ఇండియా రేంజ్ లో దాదాపు 350 కోట్లతో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో రెండు నెలల ముందే ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువ. ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లో అటు సినిమా విశ్లేషకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా సూర్య ఇందులో ఆరు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడన్న టాక్ ఉండనే ఉంది. అదీకాక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ఫైర్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాపై భారీ హైప్ వచ్చింది. ఇప్పటి వరకు సినిమా చరిత్రలో రాని ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక రెండు నెలల ముందే ట్రైలర్ ను రిలీజ్ చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం కాక.. అందరిని షాక్ కు గురిచేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే..

ముందు నుంచి అనుకున్నట్లుగానే ఈ సినిమా విజువల్ వండర్ గా ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. రెండు తెగల మధ్యసాగే పోరాటంగా ఈ మూవీ ఉండబోతున్నలు అర్ధమవుతుంది. విదేశీయులకు సంబంధించి ఓడను చూపించి క్యూరియాసిటీని మరింత పెంచాడు డైరెక్టర్. ఇక సముద్రంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కు ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా తన నటనతో మెస్మరైజ్ చేశాడు. అడవుల్లో వచ్చే యాక్షన్ సీన్స్ గురించి చెప్పుకోవడానికి మాటలు చాలవు. ఎంత చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. సూర్య నట విశ్వరూపం చూపాడు. అతడు కనిపించే ప్రతీ సీన్ కు థియేటర్లు దద్దరిల్లాల్సిందే. చివర్లో మెుసలిని చంపే సీన్ అయితే హైలెట్. లాస్ట్ లో ఓ వ్యక్తి ఫేస్ ను రివీల్ చేయలేదు మేకర్స్. బహుశా అతడు సూర్య తమ్ముడు కార్తీనే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. మెుత్తానికి సూర్య కంగువ ట్రైలర్ విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లడం ఖాయం. మరి కంగువ ట్రైలర్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet