iDreamPost
android-app
ios-app

సూర్యతో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఫ్యాన్స్‌కు పండుగ..!

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా మారిపోతున్నాడు. కంగువా దసరాకు రిలీజ్ అవుతుండగా... మరో చిత్రాన్ని కూడా అక్టోబర్ నాటికి కంప్లీట్ చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది.

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా మారిపోతున్నాడు. కంగువా దసరాకు రిలీజ్ అవుతుండగా... మరో చిత్రాన్ని కూడా అక్టోబర్ నాటికి కంప్లీట్ చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది.

సూర్యతో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఫ్యాన్స్‌కు పండుగ..!

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్యకు తమిళనాడులోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున్న ప్యాన్స్ ఉన్నారు. తన సినిమాలతో టాలీవుడ్ మార్కెట్ పెంచుకున్న ఈ నటుడు.. ప్రెస్టియస్ ప్రాజెక్ట్ కంగువాతో రాబోతున్నాడు. దసరా కానుకగా ఈ మూవీ పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ కాబోతుంది. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. సూర్య కెరీర్‌లోనే అత్యంత బిగ్ ప్రాజెక్టుగా రాబోతుంది. సుమారు 300లకు పైగా ఖర్చు పెట్టాయి స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్. ప్రస్తుతం మూవీ పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. సూర్య  తదుపరి చిత్రం కూడా సూపర్ వేగంతో షూటింగ్ జరుపుకుంటుంది.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44గా తెరకెక్కుతోంది. ఇది పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది.

ఇప్పటికే సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్, నాజర్, సుజిత్ శంకర్, తమీజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ కంప్లీట్ చేసుకుందట. ఇటీవల కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. చిన్న విరామం తీసుకుంటున్నాడు సూర్య. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నాటికి సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. స్టార్ కథానాయిక సూర్యతో ఆడిపాడబోతుందట. నెక్ట్స్ షెడ్యూల్లో ఈ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు.

టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. తదుపరి జరగబోయే ఊటీ షెడ్యూల్లో ఈ ఇద్దరి మీద చిత్రీకరించబోతున్నారని తమిళ ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. కాగా, ఈ ఇద్దరు పెయిర్ కావడం ఇదే తొలిసారి అవుతుంది.  ఇక ఫ్యాన్స్‌కు పండుగే అన్నమాట. సూర్య 44గా రాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. స్టోన్ బెంచ్, 2డి ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక కంగువా విషయానికి వస్తే..ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. స్టార్ కాస్ట్ కూడా పెద్దదే. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటానీతో పాటు జగపతి బాబు, యోగి బాబు, కోవై సరళ, వెన్నెల కిశోర్ వంటి స్టార్స్ యాక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన కంగువా ట్రైలర్.. యూట్యూబ్‌ని షేక్ చేసేసింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetgrandpashabet