iDreamPost
android-app
ios-app

చంద్రబాబు ఇంత భయపడ్డాడా ? ఎక్కడా నోరెత్త లేదే ?

  • Published Apr 17, 2020 | 10:07 AM Updated Updated Apr 17, 2020 | 10:07 AM
చంద్రబాబు ఇంత భయపడ్డాడా ? ఎక్కడా నోరెత్త లేదే ?

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మరీ ఇంత పరికి వాడా ? ఇటు పార్టీ నేతలతో పాటు మామూలు పబ్లిక్ కూడా ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టాలని అనుకున్న ఇంగ్లీషు మీడియం జీవోలను హై కోర్టు కొట్టేసింది. కోర్టు తీర్పును ఎల్లోమీడియా ప్రముఖంగా బ్యానర్ స్టోరీలుగా ప్రకటించింది. అంటే జగన్ మీదున్న కసినంతా తన వార్తల్లో చూపించింది లేండి. అంతా బాగానే ఉంది కానీ ఎక్కడ కూడా చంద్రబాబునాయుడు అభిప్రాయాన్ని ప్రచురించ లేదు.

మామూలుగా అయితే జగన్ కు వ్యతిరేకంగా కోర్టుతీర్పు వస్తే చంద్రబాబు, టిడిపి నేతలతో పాటు ఎల్లోమీడియా రెచ్చిపోయి వార్తలను వండి వార్చటంలో చొక్కాలు చించుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు జరిగింది కూడా అదే. కాకపోతే ఎక్కడా కోర్టు తీర్పు విషయంలో చంద్రబాబు కామెంట్ లేదు. కోర్టు తీర్పు రాగానే చంద్రబాబు వెంటనే మీడియా సమావేశం పెట్టి గంటల కొద్దీ జగన్ ను తప్పు పడుతు మాట్లాడుతాడని అందరు అనుకున్నారు. కానీ చంద్రబాబు మీడియా ముందుకే రాలేదు.

ఇక్కడే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా కోర్టు తీర్పిచ్చినా చంద్రబాబు మీడియా ముందుకొచ్చి ఎందుకు మాట్లాడలేదు ? ఎందుకంటే ఇంగ్లీషుమీడియం కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వల్ల నిజానికి జగన్ కు వచ్చే నష్టమేమీ లేదు. నష్టపోయేది లక్షలాది పేద విద్యార్ధులు. బిసి, మైనారిటి, ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు ప్రభుత్వం స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే ఎంతో మేలు జరుగుతుంది.ల మొదట్లో ఇబ్బందులు ఏమైనా వచ్చినా తర్వాత అన్నీ సర్దుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇపుడు కోర్టు తీర్పుతో నష్టపోయేది పై వర్గాల ప్రజల పిల్లలే. ఇపుడు గనుక కోర్టు తీర్పు ప్రకారం జగన్ ను చంద్రబాబు తప్పు పడితే పై వర్గాల ఆగ్రహానికి గురికావాల్సొస్తుంది. ఇప్పటికే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టటాన్ని గతంలో వ్యతిరేకించినందున జనాలు చంద్రబాబుపై మండిపోతున్నారు. జనాగ్రహం చూసిన తర్వాతే తన స్టాండ్ మార్చుకుని ప్రభుత్వానికి మద్దతిచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

అసలే పార్టీ పరిస్ధితి అంతంత మాత్రంగా ఉంది. ఇపుడు కోర్టు తీర్పు నేపధ్యంలో మళ్ళీ జనాలకు ఇంకా మండిందంటే అంతే సంగతులు. ఈ భయంతోనే ఎల్లోమీడియాలో తన స్పందన లేకుండా, తాను మీడియా ముందుకు రాకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డాడు. అంటే దీన్నిబట్టే చంద్రబాబు ఎంత భయస్తుడో అర్ధమైపోతోంది.