బెల్లంహీరోకు ఛత్రపతి బ్రేకులు

షూటింగ్ సగానికి పైగానే అయిపోయిందన్నారు కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. దర్శకుడు వివి వినాయక్ హైదరాబాద్ లోనే ఉన్నా దీనికి సంబంధించిన ఇన్ఫో ఇవ్వడం లేదు. ఇంతకీ ఆగిపోయిందో బ్రేక్ ఇచ్చారో తెలియలేదు.

షూటింగ్ సగానికి పైగానే అయిపోయిందన్నారు కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. దర్శకుడు వివి వినాయక్ హైదరాబాద్ లోనే ఉన్నా దీనికి సంబంధించిన ఇన్ఫో ఇవ్వడం లేదు. ఇంతకీ ఆగిపోయిందో బ్రేక్ ఇచ్చారో తెలియలేదు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా హిందీలో రూపొందుతున్న ఛత్రపతి రీమేక్ మొదలై ఇప్పటికే ఎన్నో నెలలు గడిచిపోయాయి. షూటింగ్ సగానికి పైగానే అయిపోయిందన్నారు కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. దర్శకుడు వివి వినాయక్ హైదరాబాద్ లోనే ఉన్నా దీనికి సంబంధించిన ఇన్ఫో ఇవ్వడం లేదు. ఇంతకీ ఆగిపోయిందో బ్రేక్ ఇచ్చారో తెలియలేదు. గత ఏడాది అల్లుడు అదుర్స్ డిజాస్టర్ తర్వాత సాయిశ్రీనివాస్ టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. మధ్యలో స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఒకటి ప్రకటించారు కానీ అదే సబ్జెక్టు రవితేజ కూడా చేస్తుండటంతో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఇంకో తెలుగు మూవీ ఒప్పుకోలేదు.

ఈ నేపథ్యంలో తన ఆశలన్నీ ఛత్రపతి మీదే ఉన్నాయి. రచయిత విజయేంద్రప్రసాద్ ఏవో కొన్ని కీలక మార్పులు చేశారు కానీ అవేంటనేది బయటికి రాలేదు. నిజానికి బాలీవుడ్ లో పరిస్థితి ఇప్పుడేం బాలేదు. పెద్ద స్టార్ హీరోల చిత్రాలే బోల్తా కొడుతున్నాయి. సామ్రాట్ పృథ్విరాజ్, షంషేరా కనీసం రిలీజ్ ఖర్చులను వెనక్కు ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో సౌత్ నుంచి వచ్చిన ఒక హీరో అందులోనూ 17 ఏళ్ళ క్రితం రిలీజైన తెలుగు సినిమా రీమేక్ తో రావడం అంటే సాహసమే. అందులోనూ ఒరిజినల్ వెర్షన్ యూట్యూబ్ లో ఆల్రెడీ ఉంది. మిలియన్ల వ్యూస్ తో నార్త్ ఆడియన్స్ ఎపుడో చూసేశారు. మరి ఈ ఛత్రపతి ఎందుకంటే సమాధానం చెప్పడం కష్టం.

సాయిశ్రీనివాస్ ఇక్కడే కొనసాగినా ఈపాటికి రెండో మూడో కొత్త సినిమాలు రిలీజయ్యేవి. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా తనకంటూ ఓ డీసెంట్ మార్కెట్ ఉంది. ఆ కారణంగానే అల్లుడు అదుర్స్ ఎంత పెద్ద రాడ్డు బొమ్మైనా సరే ఓ పది కోట్ల దాకా బండి లాగింది. అలాంటప్పుడు ఇక్కడే కొనసాగితే సరిపోయేది. ఇప్పటికే ఛత్రపతి రీమేక్ కోసం ఏడాదిపైగానే గడిచిపోయింది. ఇంకా ఆలస్యం చేసే కొద్దీ అక్కడి ట్రేడ్ లోనూ ఆసక్తి తగ్గొచ్చు. పాజిటివ్ గా అనిపించే అంశం ఒకటుంది. ఆర్ఆర్ఆర్. కెజిఎఫ్, పుష్పల పుణ్యమాని మన హీరోలు దర్శకుల మీద అక్కడ సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ అవన్నీ స్ట్రెయిట్ సబ్జెక్టులు. మరి చూసేసిన కథతో ఛత్రపతి ఏం చేస్తాడో

Show comments