iDreamPost
iDreamPost
గత ఏడాదికి పైగా సరైన స్టార్ హీరో సినిమా థియేటర్లో రిలీజ్ కాక బాలీవుడ్ అల్లాడిపోతున్న టైంలో నిన్న విడుదలైన సినిమా బెల్ బాటమ్. మహారాష్ట్రతో సహా చాలా రాష్ట్రాల్లో హాళ్లు తెరుచుకోనప్పటికీ రిస్క్ చేసి మరీ దీన్ని పెద్దతెరపై తీసుకొచ్చారు. నిన్న దేశవ్యాప్తంగా దీనికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయని టాక్. అయితే ఉత్తరాది ప్రాంతాల్లో ఇంకా కరోనా భయం నెలకొన్న నేపథ్యంలో కొన్ని చోట్ల వసూళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదని ట్రేడ్ టాక్. అక్షయ్ కుమార్ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ లేవంటున్నారు కానీ దానికి కారణం ముంబై లాంటి మేజర్ రెవిన్యూ వచ్చే చోట సినిమా రిలీజ్ కాకపోవడమే. ఇంత అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.
1978 ప్రాంతంలో ఇండియా పాకిస్థాన్ మధ్య స్నేహ బంధాలు బలపడుతున్న సమయంలో వరసగా ఫ్లైట్ హై జాక్స్ జరుగుతూ ఉంటాయి. ప్రధాని ఇందిరా గాంధీ హయాంలోనూ ఇలాంటి దురాగతానికి పాల్పడతారు టెర్రరిస్టులు. దీంతో ఈ మిషన్ కోసం ప్రత్యేకంగా అన్షుల్ అలియాస్ బెల్ బాటమ్(అక్షయ్ కుమార్)ని పిలిపిస్తారు. ఇతను రా ఏజెంట్. గతంలో ఇలాంటి దుర్ఘటనలోనే తన బామ్మను కోల్పోయిన విషాదం తనను వెంటాడుతు ఉంటుంది. అందుకే ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా ఉంటాడు. ముష్కరులతో చర్చలు చేసి డిమాండ్లకు తలొగ్గకుండా ప్రయాణికులను తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటాడు. అదెలా అనేదే సినిమాలో చూడాలి
ఇది పూర్తిగా అక్షయ్ కుమార్ వన్ మ్యాన్ షో. టేకాఫ్ కొంత నెమ్మదిగా ఉంటుంది. విమానాన్ని టెర్రరిస్టులు తమ ఆధీనంలో తీసుకోవడం, ఏం చేయాలనే దాని మీద ప్రధాని చర్చలు జరపడం ఇవేమంత ఎగ్జైటింగ్ గా సాగవు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా సోసోనే. ఎమోషన్ ని రిజిస్టర్ చేసే ప్రయత్నం చేశారు. బెల్ బాటమ్ మిషన్ ని తన చేతుల్లోకి తీసుకున్నాకే అసలు డ్రామా ఆసక్తికరింగా ఉంటుంది. వాణి కపూర్, హ్యూమా ఖురేషి, లారాదత్తా ఆయా పాత్రలకు తగ్గట్టు ఒదిగిపోయారు. దర్శకుడు రంజిత్ ఎం తివారి వన్ అఫ్ ది బెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఇవ్వలేదు కానీ బాలీవుడ్ వెల్కమ్ బ్యాక్ కు తగిన సినిమాను పర్ఫెక్ట్ గా ఇచ్చాడు
Also Read : క్రేజీ అంకుల్స్ రిపోర్ట్