iDreamPost
android-app
ios-app

ఆ దొంగలను పట్టుకుంటే రూ.5 లక్షల నజరానా.. కన్నప్ప టీమ్ సంచలన ప్రకటన!

  • Published Nov 09, 2024 | 1:33 PM Updated Updated Nov 09, 2024 | 1:46 PM

Kannappa Movie: ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వంలొ మంచు విష్ణు ప్రధాన పాత్రలో నాన్ ఇండియా సినిమా ‘కన్నప్ప’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కన్నప్ప మూవీ మేకర్స్ కీలక ప్రటన చేశారు. అదేంటో చూద్దాం..

Kannappa Movie: ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వంలొ మంచు విష్ణు ప్రధాన పాత్రలో నాన్ ఇండియా సినిమా ‘కన్నప్ప’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కన్నప్ప మూవీ మేకర్స్ కీలక ప్రటన చేశారు. అదేంటో చూద్దాం..

  • Published Nov 09, 2024 | 1:33 PMUpdated Nov 09, 2024 | 1:46 PM
ఆ దొంగలను పట్టుకుంటే రూ.5 లక్షల నజరానా.. కన్నప్ప టీమ్ సంచలన ప్రకటన!

తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘కన్నప్ప’. రూ.125 కోట్ల బడ్జెట్ తో 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని ఈ మధ్య టీజర్ రిలీజ్ చేసే సమయంలొ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ ఫోటో లీక్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  దీనిపై స్పందించిన మూవీ మేకర్స్ ఓ కీలక ప్రకటన చేశారు. పూర్తి వివరాల్లోెకి వెళితే..

‘కన్నప్ప కోసం గత 8 సంవత్సరాలుగా మేము  ప్రాణాలు పెట్టి చేస్తూ వచ్చాం.  రెండు సంవత్సరాల నిబద్ధతతో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి మా టీమ్ నిరంతరం కృషి చేస్తు వస్తుంది. ఇలాంటి క్షణంలో కన్నప్ప సినిమా మూవీ నుంచి ప్రభాస్ వర్కింగ్ స్టిల్ అనధికారంగా లీక్ అయినందుకు చాలా బాధ పడుతున్నాము. ఈ లీక్ మా కష్టాన్ని మాత్రమే కాకుండా, ఈ ప్రాజెక్ట్లపై నిరంతరం కృషి చేస్తున్న 2,000 మందికి పైగా VFX కళాకారుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ లీక్ ఎలా జరిగింది విషయం గురించి ఇప్పటికే పోలీస్ కేసు పెట్టాం. సినీ ప్రేమికులకు ఒక్కటే విజ్ఞప్తి.. ఈ లీక్ అయిన ఇమేజ్ ఫుటేజ్ ను ఎవరైనా షేర్ చేస్తూ ఉంటే, ఆ దొంగల్ని పట్టుకోమని అభిమానులందర్నీ మనస్ఫూర్తిగా కోరుతున్నాము. దీనిని షేర్ చేయడం ద్వారా, చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి ఉంటుంది.అంతేకాదు ఈ లీక్ చేసిన వారిని ఎవరైనా కనుగొంటే వారికి 5,00,000 రూపాయలు బహుమానంగా ఇస్తున్నాం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ట్విట్టర్ అకౌంట్కు డైరెక్ట్ గా మెసేజ్ పంపండి అని ప్రార్ధిస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. ఇలాంటి సమయంలో ఫోటో లీక్ చేస్తూ సినిమాపై ఇన్ టెన్షన్ తగ్గించే వారిని పట్టుకోవాలని మీ సహాయాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.ఈ సినిమా స్ఫూర్తిని కాపాడటంలో మాతో చేతులు కలపండి’ అంటూ పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కన్నప్ప ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు నటీనటుల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కన్నప్ప మేకర్స్ ప్రభాస్ ఫస్ట్ లుక్ మాత్రం రివీల్ చేయకుండా సస్నెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇటీవల కన్నప్ప టీజర్ లో కనిపించీ కనపబడకుండా ఓ షాట్ లో మెరిసాడు ప్రభాస్. తాజాగా కన్నప్ప సినిమాకు సంబంధించిన ప్రభాస్ ఫోటో ఒకటి లీక్ అయ్యింది. లాంగ్ హెయిర్ తో శివ నామాలు పెట్టుకొని, మెడలో రుద్రాక్షలు ధరించి, కాషాయ కండువా ధరించి చేతిలో ఆయుధం పూని ప్రభాస్ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే యూనిట్ కు చెందిన ఎవరో సెల్ ఫోన్‌లో ఈ ఇమేజ్ క్లిక్ మనిపించి ఎక్స్ లో పోస్ట్ చేసారు. దీనిపై కన్నప్ప చిత్ర యూనిట్ చాలా సీరియస్ గా స్పందించింది.
An Urgent and Heartfelt Appeal from the Kannappa Team 🙏

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet