iDreamPost
android-app
ios-app

ప్రాణం పెట్టి తీసిన మూవీ ఫ్లాప్ అయితే.. గుండె ముక్కలవుతుంది: స్టార్ హీరో 

  • Published Jul 24, 2024 | 1:36 PM Updated Updated Jul 24, 2024 | 1:36 PM

ప్రాణం పెట్టి తీసిన సినిమా ఫ్లాప్ అయితే గుండె ముక్కలౌతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఓ స్టార్ హీరో. మరి ఇంత మానసిక వేదన అనుభవిస్తున్న ఆ హీరో ఎవరు? తెలుసుకుందాం పదండి.

ప్రాణం పెట్టి తీసిన సినిమా ఫ్లాప్ అయితే గుండె ముక్కలౌతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఓ స్టార్ హీరో. మరి ఇంత మానసిక వేదన అనుభవిస్తున్న ఆ హీరో ఎవరు? తెలుసుకుందాం పదండి.

  • Published Jul 24, 2024 | 1:36 PMUpdated Jul 24, 2024 | 1:36 PM
ప్రాణం పెట్టి తీసిన మూవీ ఫ్లాప్ అయితే.. గుండె ముక్కలవుతుంది: స్టార్ హీరో 

ఇండస్ట్రీలో జయాపజయాలు కామన్. కానీ.. హీరోలకు అలా ఉండదు. వరుసగా ఫ్లాప్స్ వస్తుంటే.. ఇండస్ట్రీలో ఎవ్వరు పట్టించుకోరు. అవకాశాలు కూడా రావు. నిర్మాతలు అలాంటి హీరో వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. ప్రస్తుతం ఓ హీరోను వరుస ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి. దాంతో మానసికంగా కుంగిపోయాడనుకుంటా ఆ హీరో. ప్రాణం పెట్టి తీసిన సినిమా ఫ్లాప్ అయితే గుండె ముక్కలౌతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఓ స్టార్ హీరో. మరి ఇంత మానసిక వేదన అనుభవిస్తున్న ఆ హీరో ఎవరు? తెలుసుకుందాం పదండి.

అక్షయ్ కుమార్.. బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే గత రెండు సంవత్సరాల్లో అక్షయ్ కుమార్ నటించిన దాదాపు 8 సినిమాలు విడుదల కాగా.. అందులో ఒక్క ‘ఓ మై గాడ్’ మాత్రమే విజయం దక్కించుకుంది. మిగిలి చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. రక్షా బంధన్, రామ్ సేతు, బడేమియా చోటే మియా, మిషన్ రాణిగంజ్ మూవీస్ అక్షయ్ కెరీర్ లోనే డిజాస్టర్లుగా నిలిచాయి. ఇటీవలే వచ్చిన లేటెస్ట్ మూవీ సర్పీరా మూవీ కూడా నిరాశపరిచింది. ఇక వరుస ఫ్లాప్ లపై తాజాగా స్పందించాడు అక్షయ్ కుమార్.

Akshay Kumar

అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..”ప్రతి సినిమా వెనక ఎంతో మంది కష్టం దాగుంటుంది. అంతే కాకుండా మేం ఆ సినిమాను ప్రాణం పెట్టి చేస్తాం. ఇంత కష్టపడ్డ మూవీస్ ఫ్లాప్ అయినప్పుడు మా గుండెలు ముక్కలౌతాయి. అయితే పరాజయాలు చవిచూసినప్పుడు వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. అప్పుడే నెక్ట్స్ మూవీ హిట్ కొట్టాలన్న కసి పెరుగుతుంది. ఇది నా కెరీర్ లో ముందుగానే నేర్చుకున్నాను. ఎంత కష్టపడి పనిచేసినా.. ఒక్కోసారి రిజల్ట్ మన చేతిలో ఉండదు. అలాంటి టైమ్ లో మనం ఏం చేయలేం. నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాను” అంటూ ఈ స్టార్ హీరో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అక్షయ్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio