iDreamPost
android-app
ios-app

మూవీపోతే.. నేనే పోయానన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు: స్టార్ హీరో

Star Hero Strong Counter To Trollers: సాధారణంగా సినిమా హీరో అనగానే వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ అంటారు. అందులోనూ స్టార్ హీరో అయితే ఆయనకు తిరుగేముంది అంటారు. ఇదంతా హిట్లు పడినంత వరకు మాత్రమే ఉంటుంది. ఫ్లాపులు వస్తే ఇదిలే ఇలా వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది.

Star Hero Strong Counter To Trollers: సాధారణంగా సినిమా హీరో అనగానే వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ అంటారు. అందులోనూ స్టార్ హీరో అయితే ఆయనకు తిరుగేముంది అంటారు. ఇదంతా హిట్లు పడినంత వరకు మాత్రమే ఉంటుంది. ఫ్లాపులు వస్తే ఇదిలే ఇలా వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది.

మూవీపోతే.. నేనే పోయానన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు: స్టార్ హీరో

సినిమా అనేది రంగుల ప్రపంచం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పూలు ఉంటాయి.. ముళ్లు ఉంటాయి అని చెబుతూ ఉంటారు. సక్సెస్ వచ్చినంత వరకు ఎవరైనా హీరోనే.. ఆ సక్సెస్ పలకరింపు దూరమైతే ఎవరైనా జీరో అయిపోవాల్సిందే. ఆ సమయంలో ఇండస్ట్రీలో మీకంటూ ఎవరూ ఉండరు అని ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువు కూడా అయ్యింది. అయితే ఫ్లాప్ పడిందంటే.. ప్రతి ఒక్కరు సలహాలు ఇచ్చేస్తారు.. ప్రతి ఒక్కరు ఓదారుస్తారు అన్నట్లు స్టార్ హీరో చెప్పుకొచ్చాడు. తన సినిమా ఫ్లాప్ అయితే.. తాను ఏదో పోయినట్లుగా కొందరు ఓదార్చడం బాలేదు అన్నట్లుగా ఆ హీరో అసహనం వ్యక్తం చేశాడు.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. అక్షయ్ కుమార్. బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అక్షయ్ కుమార్ కు ఇటీవల కొన్ని సినిమాలు ఆశించినంత ఫలితం తీసుకురాలేదు. అందుకు బాలీవుడ్ లో చాలా మంది చింతిస్తున్నారు. ఒక సినిమా ఫ్లాప్ కాగానే మెసేజులు వచ్చేస్తాయంట. ఈ మాటలు స్వయంగా అక్షయ్ కుమార్ వెల్లడించాడు. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో తెరకెక్కించిన ‘ఖేల్ ఖేల్ మే’ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక ఈవెంట్ నిర్వహించగా.. అక్షయ్ కుమార్ కు ఒక ప్రశ్న ఎదురైంది. సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అని. అందుకు అక్షయ్ కుమార్ కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశాడు.

aKSHAY kUMAR

“అవును నావి నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ముందుగా మీకు ఒక కథ చెప్తాను. ఈ కథ మా నాన్న నాకు చెప్పారు. ఒక వ్యక్తి ఉంటాడు. అతని ఆవు తప్పిపోతుంది. ఊరంతా వచ్చి అయ్యో పాపం అంటుంది. రెండ్రోజుల తర్వాత ఆ ఆవు ఇంటికి తిరిగొస్తుంది. అది కూడా మరో 3 ఆవులను తీసుకుని. అప్పుడు ఊరంతా వచ్చి.. అరె నీకు 4 ఆవులు దక్కాయి అని శుభాకాంక్షలు చెబుతారు. ఆ తర్వాత వాళ్ల అబ్బాయి ఆవు మీద వెళ్తూ కిందపడి కాలు విరుగుతుంది. అప్పుడు ఊరంతా వచ్చి పిల్లాడు కాలు విరిగిందే అని అయ్యో పాపం అంటుంది. తర్వాత రాజుగారు ఊర్లో ఉన్న కుర్రాళ్లను పిలిచి మిలటరీ ట్రైనింగ్ ఇస్తారు. యుద్ధంలో పాల్గొనాలి అని.

అయితే ఈ కుర్రాడికి కాలు విరిగిందని తీసుకోరు. అప్పుడు కూడా అంతా మీ వాడి కాలు విరగడం మంచిదైంది కదా అంటారు. ఇక్కడ మోరల్ ఏంటంటే.. ఏం జరిగినా మన మంచికే. సినిమాలే ఫ్లాప్ అయ్యాయి.. నేను చనిపోలేదు కదా? ఒక్క మూవీ పోగానే సంతాపం చెబుతూ మెసేజులు పెడతారు. ఒక పేపర్ ఆయన అక్షయ్ నువ్వు కమ్ బ్యాక్ ఇవ్వాలి అని రాశాడు. నేను ఎక్కడికైనా వెళ్తే కదా.. కంబ్యాక్ ఇవ్వడానికి. నేను ఇక్కడే ఉన్నా.. ఉంటాను. నేను పోయే వరకు నేను నటిస్తూనే ఉంటాను” అంటూ అక్షయ్ కుమార్ కామెంట్స్ చేశాడు. మరి.. అక్షయ్ కుమార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.