iDreamPost
iDreamPost
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం గందరగోళానికి దారితీస్తోంది. రిజర్వేషన్లు ఎక్కువ ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్‌పై సుంప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఇచ్చిన 176 జీవోపై స్టే ఇచ్చింది. నాలుగువారాల్లోగా దీనిపై విచారణ పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయ్యింది.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం తుంగలోతొక్కిందని కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈయన ఏ.పి రెడ్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఏ.పిలో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీని వల్ల రాష్ట్రంలోని 20వేల మంది ఓసీలు పోటీ చేసే అవకాశం కోల్పోతారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటీసీ, ఎంపిపి, ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఓసీలకు నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. హైకోర్టుకు విచారించాలని ఆదేశాలు ఇచ్చింది.
అయితే దీన్ని కొందరు తమదైన శైలిలో దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కావాలనే ఇలా ఎన్నికలు వాయిదా వేయించేందుకు ప్లాన్ చేసిందని చెబుతున్నారు.. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఓ వ్యక్తి కలిసి ఉన్న ఫోటోను పెట్టి ఈయనే బిర్రు ప్రతాపరెడ్డి అని.. సీఎం జగన్‌తో కలిసి ఉన్న వ్యక్తే ఇలా చేస్తున్నారంటున్నారు. వైసీపీ నేత కే తాము గెలవలేమన్నభయం ఉందని అందుకే ఇలా ఎన్నికలు వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లారని చెబుతున్నారు. అయితే ఫోటోలో సీఎం జగన్‌తో ఉన్న వ్య క్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బి్ర్రు ప్రతాపరెడ్డి కాదు. ఈయన భజరంగదల్ నేత ప్రతాపరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్న వ్యక్తులు ఈ విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలి.. కేవలం వైసీపీపై బురదజల్లడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదోవపట్టిస్తున్నామని వారు తెలుసుకోవాలి.