iDreamPost
android-app
ios-app

మరో మలయాళ నటుడు తెలుగోళ్లకు దగ్గరయ్యాడు..

  • Published May 21, 2025 | 12:00 PM Updated Updated May 21, 2025 | 12:00 PM

Basil Joseph: ఇప్పుడు OTTల పుణ్యమా అందరూ మనవారైపోతున్నారు. ముఖ్యంగా తెలుగోళ్లు కంటెంట్ నచ్చితే ఇక ఆ హీరో సినిమాలనే కాదు ఆ హీరోను కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. OTT లలో కంటెంట్ పెరిగిన తర్వాత వాటిలో ముఖ్యంగా మలయాళ సినిమాలకు విపరీతమైన క్రేజ్ లభించింది. అలా కొంతమంది మలయాళ నటులు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు వేయించుకున్నారు.

  • Published May 21, 2025 | 12:00 PMUpdated May 21, 2025 | 12:00 PM
మరో మలయాళ నటుడు తెలుగోళ్లకు దగ్గరయ్యాడు..

ఒకప్పుడు కేవలం థియేటర్స్ లో నే సినిమాలు చూసేవాళ్ళు కాబట్టి.. ఇతర భాషల నటీ నటుల మీద అంత ఆదరణ చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు OTTల పుణ్యమా అందరూ మనవారైపోతున్నారు. ముఖ్యంగా తెలుగోళ్లు కంటెంట్ నచ్చితే ఇక ఆ హీరో సినిమాలనే కాదు ఆ హీరోను కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. OTT లలో కంటెంట్ పెరిగిన తర్వాత వాటిలో ముఖ్యంగా మలయాళ సినిమాలకు విపరీతమైన క్రేజ్ లభించింది. అలా కొంతమంది మలయాళ నటులు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు వేయించుకున్నారు. ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు బాసిల్ జోసెఫ్.

జయ జయ జయ జయహే, నూనాక్కుళి, సూక్ష్మ దర్శిని, గురువాయూర్ అంబలనదాయిల్, ప్రవిన్‌కుడు షాపు.. ఇలా వరుస సినిమాలతో తెలుగోళ్లలో తన మార్క్ సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాలన్నీ కూడా OTT లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాయి. వీటి తర్వాత రీసెంట్ గా వచ్చిన పొన్ మ్యాన్ తో అతని ఫాలోయింగ్ ఇంకాస్త పెరిగిందని చెప్పి తీరాల్సిందే. ఈ హీరో పిక్ చేసుకునే సినిమాలన్నీ కంటెంట్ ఓరియెంటెడ్ అవ్వడంతో.. అతని సినిమాలన్నీ మన వాళ్లకు తెగ నచ్చేస్తున్నాయి. ఇతని నుంచి ఏదైనా సినిమా వస్తుంది అంటే కచ్చితంగా సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. పైగా బాసిల్ జోసెఫ్ హీరో మాత్రమే కాదు.. ఇతనిలో ఓ దర్శకుడు కూడా దాగి ఉన్నాడు. మిన్నల్ మురళి’ సహా మూడు సినిమాలు తీశాడు. త్వరలోనే ఈ హీరో సూర్యతో కలిసి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేయబోతున్నాడట. దీనికి సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.