iDreamPost
android-app
ios-app

రిజర్వేషన్లు వద్దంటూ రోడ్లపైకి విద్యార్థులు.. ఎక్కడంటే..?

ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం రిజర్వేషన్లు తీసుకువస్తూ కర్ణాటక సర్కార్ ముసాయిదా బిల్లును తీసుకు వచ్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది. కానీ ఇప్పుడు ఇదే రిజర్వేషన్స్ ఆ దేశాన్ని అగ్నిగుండంగా మార్చేశాయి.

ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం రిజర్వేషన్లు తీసుకువస్తూ కర్ణాటక సర్కార్ ముసాయిదా బిల్లును తీసుకు వచ్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది. కానీ ఇప్పుడు ఇదే రిజర్వేషన్స్ ఆ దేశాన్ని అగ్నిగుండంగా మార్చేశాయి.

రిజర్వేషన్లు వద్దంటూ రోడ్లపైకి విద్యార్థులు.. ఎక్కడంటే..?

కర్ణాటకలో రిజర్వేషన్లు, కోటా అంశం వివాదం అయ్యింది. ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు ప్రాధాన్యతనిస్తూ 75 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ముఖ్యమంత్రి సిద్ద రామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ముసాయిదా బిల్లును సిద్దం చేసింది. ఐటి ఉద్యోగాలతో సహా మేనేజ్ మెంట్ ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్ మెంట్ కేటగిరిలో 75 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు బిల్లును రూపొందించగా.. క్యాబినేట్ ఆమోదం కూడా పొందింది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కాగానే వెంటనే వెనక్కు తగ్గింది సర్కార్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో దేశంలో ఈ రిజర్వేషన్లపై చెలరేగిన వివాదం.. కార్చిచ్చుకు దారి తీసింది. ఆ దేశాన్ని అగ్ని గుండంగా మార్చేసింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చేపడుతున్నారు. రహదారులను దిగ్భందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపడుతున్నారు. ఈ నిరసన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు షేక్ హసీనా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. విద్యార్థులపై రబ్బరు బుల్లెట్స్, టియర్ గ్యాస్‌లు వినియోగించడంతో ఇప్పటి వరకు 39 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. వీరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాకిస్తాన్ చెర నుండి 1971 స్వాత్రంత్యం పొందింది బంగ్లాదేశ్. అయితే ఆ యుద్ధంలో పాల్గొన్న సైనికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడో వంతు రిజర్వేషన్లను కల్పించింది హసీనా ప్రభుత్వం. ఈ చర్యకు వ్యతిరేకంగా  విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశ ప్రధాని హసీనా తన అనుకూలురుకు మేలు చేసే విధంగా ఈ రిజర్వేషన్లు తీసుకు వచ్చిందని విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

ఈ కోటా వ్యవస్థను నిలిపి వేయాలంటూ స్టూడెంట్స్ రోడ్డెక్కారు. ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఇదిలా ఉంటే.. శాంతించాలంటూ నిరసనకారులను దేశ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది హసీనా. ఇది ఆందోళనకారులను మరింత రెచ్చగొట్టేలా చేసింది. దీంతో ఢాకాలోని దేశ ప్రభుత్వ మీడియా సంస్థ బీటీవీ ప్రధాన కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో చాలా మంది లోపల చిక్కుకున్నట్లు తెలుస్తుంది. నిరసనలు మిన్నంటడతో దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్స్, టియర్ గ్యాస్‌లు వినియోగిస్తున్నారు. శాంతి, భద్రతలు క్షీణించడంతో కాలేజీలు, యూనివర్శిటీతో సహా విద్యా సంస్థలను మూసివేయాలని హసీనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. షేక్ హసీనా దేశ ప్రధానిగా నాల్గవ సారి ఎన్నికైన నుండి.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అతిపెద్ద నిరసనలు ఇవి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి