Arjun Suravaram
Bangladesh News: ఆదివారం బంగ్లాదేశ్ వ్యాప్తంగా మరోసారి ఆందోళనలు చెలరేగి.. ఆ దేశం రావణకాష్టంగా మారింది. కొంతకాలంగా సద్దుమణిగిన ఆందోళనలు మరోసారి చేలరేగడం వెనుక గల కారణం ఏమిటంటే..
Bangladesh News: ఆదివారం బంగ్లాదేశ్ వ్యాప్తంగా మరోసారి ఆందోళనలు చెలరేగి.. ఆ దేశం రావణకాష్టంగా మారింది. కొంతకాలంగా సద్దుమణిగిన ఆందోళనలు మరోసారి చేలరేగడం వెనుక గల కారణం ఏమిటంటే..
Arjun Suravaram
ప్రస్తుతం బంగ్లాదేశ్ రావణకాష్టంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై ఆ దేశంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు చేలరేగిన సంగతి తెలిసింది. కొన్ని నెలల నుంచి చాలా రోజుల పాటు బంగ్లాదేశ్ ఓ అగ్నిగుండంలా మారింది. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కొద్ది రోజుల నుంచి అల్లర్లు తగ్గాయి. అయితే తాజాగా ఆదివారం మరోసారి ఆందోళనలు చేలరేగాయి. ఈ హింసలో దాదాపు 106 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 15 మంది పోలీసులు సైతం ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా అందరిలో మొదలుతున్న ప్రశ్న ఒకటే.. ఇన్ని రోజులు ఆగిన అల్లర్లు, ఆందోళనలు.. ఆదివారం మరోసారి జరగడానికి కారణం ఏమిటా అని?. మరి.. మరోసారి ఆందోళనలు జరగడానికి కారణం ఏమిటో, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…
ఆదివారం బంగ్లాదేశ్ లో మరోసారి హింస చెలరేగింది. శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసన కారులు పోలీసులు, ప్రభుత్వాధికారులు తమకు సపోర్టుగా నిలవాలని కోరారు. అంతేకాకుండా ప్రధానమంత్రి హసీనా తన పదవికి రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్ ను కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ పేరిట సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని పలు ప్రాంతాల నుంచి ఆందోళన కారులు హాజరవుతున్నారు. అదే సమయంలో వారిని అధికార అవామీలీగ్, దాని విద్యారథి విభాగం ఛాత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు అడ్డగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలోనే వారిని నిలువరించేందుకు పలు చోట్ల భద్రతా బలగాలు కాల్పులకు దిగాయి. ఇలా దేశ వ్యాప్తంగా రోజంతా జరిగిన గొడవల్లో దాదాపు 106 మంది స్థానిక మీడియా వెల్లడించింది. మొత్తంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన చెలరేగిన హింసలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 300 దాటింది. అయితే గతంలో ఆందోళనకారులను ప్రధాని చర్చకు ఆహ్వానించారు. కానీ వారు అందుకు అంగీకరించకపోగా..ఆమె ప్రధాని పదవి నుంచి దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మరోసారి ఆదివారం ఆందోళనకు దిగడంతో..మరోసారి బంగ్లాదేశ్ రావణ కాష్టంగా మారింది.
ఇక ఆదివారం జరిగిన అల్లర్లపై ప్రధాని హసీనా స్పందించారు. హింసను ప్రేరేపించేవారు అసలు అవామీలీగ్ విద్యార్థులు కాదని బంగ్లాదేశ్ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మూడు రోజులు దేశ వ్యాప్తంగా సెలవులు ప్రకటించారు. దేశమంతా కర్ఫ్యూ విధించారు. అలానే ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారాలను మూసేశారు. ఈ గొడవల్లో వందల మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఏదైన సమస్య ఉంటే.. అక్కడ ఉన్న భారత ఎంబసీను సంప్రదించాలని తెలిపింది.