Swetha
Rana naidu web series: OTTలో వెబ్ సిరీస్ లకు మంచి ఫాలోయింగ్ లభిస్తుంది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రానా నటించిన రానా నాయుడు సిరీస్ బాగానే హిట్ అయింది. సో ఇప్పుడు రెండేళ్ల తర్వాత సీజన్ 2 ను స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.
Rana naidu web series: OTTలో వెబ్ సిరీస్ లకు మంచి ఫాలోయింగ్ లభిస్తుంది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రానా నటించిన రానా నాయుడు సిరీస్ బాగానే హిట్ అయింది. సో ఇప్పుడు రెండేళ్ల తర్వాత సీజన్ 2 ను స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.
Swetha
రెండేళ్ల కిందట రానా నాయుడు వెబ్ సిరీస్ OTTలో బాగా హిట్ అయింది. అందులోను రానా , వెంకటేష్ ఉండడంతో ఇంకాస్త క్రేజ్ అందుకుంది. కంటెంట్ పరంగా కాస్త ఆశ్చర్యపరిచిన మాట కూడా వాస్తవమే. ఇక ఇప్పుడు రెండో సీజన్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మొదటి సీజన్ లో కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి.. ఈసారి అలాంటి కంటెంట్ లేకుండా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ సిరీస్ రెండో సీజన్ జూన్13 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.
‘కుటుంబం విషయానికి వస్తే రానా అన్ని హద్దులూ దాటేస్తాడు.. రానా నాయుడు సీజన్ 2 జూన్ 13న కేవలం నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కానుంది అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా ఈ సిరీస్ లో రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియాలాంటి వాళ్లు ఇందులో నటించారు. ఈ సిరీస్ వచ్చి చాలా కాలం అయింది కాబట్టి.. ఈలోపు ఇంకా మొదటి సీజన్ ను ఎవరిని మిస్ చేస్తే కనుక.. వెంటనే నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి.
మొదటి సీజన్ కథ విషయానికొస్తే.. ఈ సీజన్ కథ అంతా కూడా కంప్లీట్ మోడ్రన్ సెటప్‌లో సాగుతుంది. ఫ్యామిలీ వాచ్ అయితే అసలు కాదనే చెప్పాలి. కథను సింపుల్ గా చెప్పాలంటే తండ్రిని ద్వేషించే కొడుకు. అతనికి గుణపాఠం చెప్పాలని ప్రయత్నించే కొడుకు. ఇలా ఈ రెండు క్యారెక్టర్స్ చుట్టూ కథ అంతా సాగిపోతుంది. మొత్తం పది ఎపిసోడ్స్ తో మొదటి సీజన్ పూర్తవుతుంది. ఇక రెండో సీజన్ లో కథను ఎలాంటి మలుపులు తిప్పుతారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.