iDreamPost
android-app
ios-app

రాకింగ్ స్టార్ యష్ తల్లి నిర్మించిన ‘కొత్తలవాడి’ చిత్రం టీజర్ రిలీజ్

  • Published May 21, 2025 | 3:00 PM Updated Updated May 21, 2025 | 3:01 PM

రాకింగ్ స్టార్ య‌ష్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న అమ్మ‌గారు శ్రీమ‌తి పుష్ప అరుణ్‌కుమార్ ఇప్పుడు నిర్మాత‌గా మారారు. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి ఆమె PA  ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో ఆమె చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు.

రాకింగ్ స్టార్ య‌ష్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న అమ్మ‌గారు శ్రీమ‌తి పుష్ప అరుణ్‌కుమార్ ఇప్పుడు నిర్మాత‌గా మారారు. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి ఆమె PA  ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో ఆమె చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు.

  • Published May 21, 2025 | 3:00 PMUpdated May 21, 2025 | 3:01 PM
రాకింగ్ స్టార్ యష్ తల్లి నిర్మించిన ‘కొత్తలవాడి’ చిత్రం టీజర్ రిలీజ్

‘కొత్తలవాడి’ చిత్రంతో నిర్మాతగా మారిన‌ రాకింగ్ స్టార్ యష్ అమ్మ శ్రీమతి పుష్ప అరుణ్‌కుమార్‌… ఆక‌ట్ట‌కుంటోన్న మూవీ టీజ‌ర్‌

రాకింగ్ స్టార్ య‌ష్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న అమ్మ‌గారు శ్రీమ‌తి పుష్ప అరుణ్‌కుమార్ ఇప్పుడు నిర్మాత‌గా మారారు. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి ఆమె PA  ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో ఆమె చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మలో సుప్ర‌సిద్ధ న‌టుడు డా.రాజ్‌కుమార్‌, ఆయ‌న స‌తీమ‌ణి పార్వ‌తమ్మ రాజ్‌కుమార్‌ల స్ఫూర్తితో కొత్త బ్యాన‌ర్‌ను స్థాపించి కొత్తవారికి అవ‌కాశం ఇవ్వ‌టానికి పుష్ప అరుణ్‌కుమార్ నిర్మాత‌గా మారారు.

పుష్ప అరుణ్ కుమార్ నిర్మాత‌గా రూపొందించిన తొలి చిత్రం ‘కొత్తలవాడి’. టాలెంటెడ్ యాక్ట‌ర్ పృథ్వీ అంబార్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమా ప్రామిసింగ్ ఫిల్మ్ మేక‌ర్ సిరాజ్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. గ‌త నెల‌లో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చి సినిమాపై అంంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది.‘కొత్తలవాడి’ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచుతూ మేక‌ర్స్ బుధ‌వారం (మే 21వ తేదీ ) రోజున టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే సినిమా పాత్ర‌ల్లోని ఇన్‌టెన్సిటినీ తెలియ‌జేసేలా ఓ స‌రికొత్త ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేశారు. మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. సినిమాటోగ్రాఫ‌ర్ కార్తీక్ అందించిన సూప‌ర్బ్ విజువ‌ల్స్‌, అభినంద‌న్ క‌శ్య‌ప్ కంపోజ్ చేసిన ప‌వ‌ర్‌ఫుల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాయి.

క‌థానాయ‌కుడు పృథ్వీ అంబ‌ర్ ర‌గ్డ్‌, ఎన‌ర్జిటిక్ లుక్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ప్ర‌భావవంతంగా మెప్పిస్తోంది. 90 సెక‌న్ల పాటు ఉన్న ఈ టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచింది. రూటెడ్‌, ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌తో ‘కొత్తలవాడి’ సినిమాను మ‌న ముందుకు డైరెక్ట‌ర్ సిరాజ్ తీసుకురాబోతున్నార‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. కొత్తలవాడి అనేది కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకులో ఉన్న ఒక గ్రామం పేరు,. అందుక‌నే ఇక్కడ చిత్రం ఎక్కువ భాగాన్ని చిత్రీక‌రించారు. సినిమా క‌థ‌కు సంబంధించిన స్థానికత, దాని మూలాలకు నిజమైన రీతిలో ఉండేలా బృందం స్థానిక యాసను కూడా సంభాష‌ణ‌ల్లో ఉప‌యోగించారు.పృథ్వీ అంబార్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో గోపాల్ దేశ్‌పాండే, రాజేష్ న‌ట‌రంగ‌, అవినాష్‌, కావ్య శైవ‌, మ‌న్షి సుధీర్‌, ర‌ఘు ర‌మ‌ణ‌ కొప్ప‌, చేత‌న్ గంధ‌ర్వ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

పా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న కొత్తలవాడి చిత్రం ద్వారా ఇద్ద‌రు కొత్త సంగీత ద‌ర్శ‌కుల‌ను మేక‌ర్స్ ప‌రిచ‌యం చేస్తున్నారు. వికాష్ వ‌శిష్ట సినిమాలోని పాట‌ల‌కు సంగీతాన్ని అందిస్తుంటే, అభినంద‌న్ క‌శ్య‌ప్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. ర‌ఘు నీనంద‌ల్లి సినిమాకు మాట‌లు రాశారు. రామిశెట్టి ప‌వ‌న్ ఎడిట‌ర్‌గా, దినేష్ అశోక్ పోస్టర్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.రా కంటెంట్‌తో తెర‌కెక్కుతోన్న ‘కొత్తలవాడి’ చిత్రంలో భావోద్వేగాలు ప్ర‌ధానంగా ఉంటాయి. అలాగే ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ సినిమా రూపొందుతోంది.