iDreamPost
android-app
ios-app

టీజర్ తర్వాత వార్ 2 బిజినెస్ సీన్ ఛేంజ్..?

  • Published May 21, 2025 | 11:23 AM Updated Updated May 21, 2025 | 11:23 AM

ఆల్రెడీ వార్ 2 సినిమా నుంచి పోస్టర్ కూడా రిలీజ్ అవ్వకముందు నుంచే సౌత్ లో.. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మూవీ థియేట్రికల్ రైట్స్ పరంగా దాదాపు రూ.100 కోట్ల వరకు కోట్ చేయబడిందని టాక్. దీనితో సినిమాపై ఇంకాస్త క్రేజ్ పెరిగింది. కానీ టీజర్ రిలీజ్ తర్వాత

ఆల్రెడీ వార్ 2 సినిమా నుంచి పోస్టర్ కూడా రిలీజ్ అవ్వకముందు నుంచే సౌత్ లో.. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మూవీ థియేట్రికల్ రైట్స్ పరంగా దాదాపు రూ.100 కోట్ల వరకు కోట్ చేయబడిందని టాక్. దీనితో సినిమాపై ఇంకాస్త క్రేజ్ పెరిగింది. కానీ టీజర్ రిలీజ్ తర్వాత

  • Published May 21, 2025 | 11:23 AMUpdated May 21, 2025 | 11:23 AM
టీజర్ తర్వాత వార్ 2 బిజినెస్ సీన్  ఛేంజ్..?

తారక్ బర్త్ డే సందర్బంగా.. తాజాగా వార్2 నుంచి టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ను గమనించినట్లయితే టీజర్ అంతా కూడా కంప్లీట్ యాక్షన్ సీన్స్ తో నిండిపోయి ఉంది. హృతిక్ రోషన్ , తారక్ కు మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ తెరపై చూడడం కోసం మూవీ లవర్స్ అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారని చెప్పి తీరాల్సిందే. అయితే ఎంత యాక్షన్ మూవీ అయినప్పటికీ.. రొటీన్ కథల్లా మాత్రం ఉండదని అంటున్నారు. సౌత్ హీరో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడనే ఆనందం అయితే ఇక్కడ ప్రేక్షకులలో కనిపిస్తుంది. కానీ టీజర్ పరంగా అంతగా శాటిస్ఫై కాలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇది కేవలం టీజర్ మాత్రమే కాబట్టి దీనిని బట్టి మొత్తం సినిమా కథను అంచనా వేయలేము. సో కథపై ఓ క్లారిటీ రావాలంటే కనీసం ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకైనా వేచి చూడాల్సిందే. ఆల్రెడీ సినిమా నుంచి పోస్టర్ కూడా రిలీజ్ అవ్వకముందు నుంచే సౌత్ లో.. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మూవీ థియేట్రికల్ రైట్స్ పరంగా దాదాపు రూ.100 కోట్ల వరకు కోట్ చేయబడిందని టాక్. దీనితో సినిమాపై ఇంకాస్త క్రేజ్ పెరిగింది. కానీ టీజర్ రిలీజ్ తర్వాత సౌత్ లో ఓ టాప్ డిస్ట్రిబ్యూటర్ వెనుకడుకు వేసినట్లు సమాచారం. దీనితో నిర్మాతలు కాస్త సందిగ్ధంలో పడిన మాట నిజం.

అయినప్పటికీ సినిమా మీద ఎంతో కొంత అంచనాలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ ఆ ట్రైలర్ కాస్త రిలీజ్ అయితే కానీ బిజినెస్ లెక్కల్లో మార్పులు రావేమో. బాలీవుడ్ లో టాక్ బాగుంటే మాత్రం కచ్చితంగా మూవీ అనుకున్నదానికంటే ఒకింత ఎక్కువ సక్సెస్ ఏ అవుతుంది. ఇటు టాలీవుడ్ లో ఈ మూవీ ప్రభావం ఎలా ఉంటుందనేదే సినిమాకు పెద్ద సవాల్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.