iDreamPost
android-app
ios-app

రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు… విద్యార్థులకు ఊరట!

Bangladesh’s quota-system protests: బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అంశంపై పెద్ద రచ్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో ఆదేశ  సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Bangladesh’s quota-system protests: బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అంశంపై పెద్ద రచ్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో ఆదేశ  సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు… విద్యార్థులకు ఊరట!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వివిధ రకాల అల్లర్లు జరుగుతుంటాయి. రిజర్వేషన్లు, ఉద్యోగాలు, రాయితీలు వంటి అనేక అంశాలపై  వివిధ దేశాల్లో నిరసనలు చేస్తుంటారు. అలానే కొన్నిసార్లు ఈ ఆందోళనలు  పెద్దగా మారి..దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో అదే పరిస్థితి ఉంది. రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన వివాదం, చిలిచిలికి  గాలివాన తుఫాన్ గా మారినట్లు విధ్వసం సృష్టించింది. ఏకంగా 115 మంది ఈ అల్లర్లలో బలయ్యారు. ఈ క్రమంలోనే విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో ఆదేశ  సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీంతో విద్యార్థులకు ఊరట లభించినట్లు అయింది. ఇక ఆ తీర్పు వివరాల్లోకి వెళ్తే..

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అంశంపై పెద్ద రచ్చ జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసులకు మూడో వంతు కోటా ఇస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దీనిని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు నిరసనలు చేపట్టారు. అవి కాస్తా…తీవ్ర రూపం దాల్చి..పెద్ద విధ్వంసం చోటుచేసుకుంది. విద్యార్థులు, నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన క్రమంలో దాదాపు 115 మృతి చెందారు. మూడు వారాలుగా  ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. గతవారం రోజుల నుంచి పరిస్థితి అదుపుతప్పి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో కనిపిస్తే కాల్చివేత అనే రూల్ ను అక్కడి ప్రభుత్వం పాస్ చేసింది.

ఇలా అగ్నిగుండాల మారిన బంగ్లాదేశ్ లో తాజాగా ఆ దేశ సుప్రీంకోర్టు  ఇచ్చిన తీర్పు కాస్తా ఊరటనిచ్చింది. రిజర్వేషన్ల కోటాపై సుప్రీంకోర్టు ఆదివారం అత్యవసర ఉత్తర్వులు వెలువరించింది. స్వాతంత్య్ర సమరయోధుల కింద ఇచ్చే రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈనెల ప్రారంభం నుంచి ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఊరట లభించింది.నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న దేశాల్లో బంగ్లాదేశ్ కూడ ఉంది. అలాంటి ఈ దేశంలో ఇప్పటికే విద్యార్థులు జాబ్స్ లేక అసహనంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో రిజర్వేషన్లను ప్రభుత్వం తీసుకురావడంపై యువత భగ్గుమంటున్నారు.

బంగ్లాదేశ్ అగ్నిగుండగా మారడానికి కారుణమైన ఈ అంశంపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. అంతేకాక ప్రతిభకే ప్రాధాన్యత ఇవ్వాలని, 93 శాతం నియామకాలను మెరిట్ ఆధారంగానే భర్తి చేయాలని స్పష్టం చేసింది. స్వాతంత్య్ర సమరయోధుల కోటాను 5 శాతానికి తగ్గించాలని, మిగిలిన రెండు శాతాన్ని మైనారిటీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని సుప్రీం కోర్టు సూచించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును విద్యార్థులు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. అలానే నిరసనల్లో అరెస్టైన వారు విడుదల సహా తమ కీలక డిమాండ్లు ప్రభుత్వ నెరవేర్చే వరకూ ఆందోళనలు మాత్రం చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విద్యార్థులకు ఊరటనే చెప్పాలి.