Swetha
Pendulum Movie OTT: OTTలో రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయి. ఒకరి శరీరంలో మరొక ఆత్మ ఆవహించడం, టైం ట్రావెల్ లో మరొక కాలంలోకి ప్రవేశించడం లాంటి ఎన్నో కథలు చూసి ఉంటారు.. కానీ కావాలని వేరొకరి కలలోకి వెళ్లడం అనే కాన్సెప్ట్ మాత్రం ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు.
Pendulum Movie OTT: OTTలో రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయి. ఒకరి శరీరంలో మరొక ఆత్మ ఆవహించడం, టైం ట్రావెల్ లో మరొక కాలంలోకి ప్రవేశించడం లాంటి ఎన్నో కథలు చూసి ఉంటారు.. కానీ కావాలని వేరొకరి కలలోకి వెళ్లడం అనే కాన్సెప్ట్ మాత్రం ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు.
Swetha
OTTలో రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయి. వీటిలో ఇప్పుడు చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మునుపెన్నడూ చూసి ఉండరు. ఇప్పటివరకు ఇలాంటి జోనర్ సినిమాలు చూసి ఉంటారు. కానీ ఈ కథ మాత్రం చాలా డిఫరెంట్. ఒకరి శరీరంలో మరొక ఆత్మ ఆవహించడం, టైం ట్రావెల్ లో మరొక కాలంలోకి ప్రవేశించడం లాంటి ఎన్నో కథలు చూసి ఉంటారు.. కానీ కావాలని వేరొకరి కలలోకి వెళ్లడం అనే కాన్సెప్ట్ మాత్రం ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు.
కలలు రావడం చాలా సహజమే. మన కలలోకి మన ప్రమేయం లేకుండా వేరొకరు వస్తూనే ఉంటారు. కానీ కావాలని ఉద్దేశ పూర్వకంగా అవతలివారి కలలోకి వెళ్లడం.. వేరే వాళ్ళని మన కలలోకి ఆహ్వానించడం తెలిస్తే ఎలా ఉంటుంది? అసలు అలాంటి ఓ అవకాశం ఉంటుందా ? ఉంటె అవి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి? అనే ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ ఇది. ఈ సినిమా పేరు ‘పెండులం’. ఇది ఓ మలయాళ మూవీ. మలయాళ సినిమాకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో తెలియనిది కాదు. ఈ మలయాళ సినిమాకు రెజిన్ బాబు దర్శకత్వం వహించారు.
ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చి రెండేళ్లు అయింది. కానీ ఇప్పుడు ఇన్నాళ్లకు OTTలోకి తెలుగు వెర్షన్ లో వస్తుంది. ఈ సినిమా మే 22 నుంచి ఈటివి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చాలా రేర్ గా వస్తూ ఉంటాయి కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.