iDreamPost
android-app
ios-app

గోదావరి 2 గురించి హింట్ ఇచ్చినట్లేనా..

  • Published May 21, 2025 | 10:57 AM Updated Updated May 21, 2025 | 10:57 AM

Godavari Sequel : శేఖర్ కమ్ముల తీసిన సినిమాలలో గోదావరి మూవీ.. అందరికి ఆల్ టైం ఫేవరేట్ అని చెప్పి తీరాల్సిందే. ప్రతి ఒక్కరికి ఇది కంఫర్ట్ మూవీ. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు ప్రతి ఒక్కరి ఫేవరేట్ ఆల్బమ్ అయిపోయాయి. అయితే రీసెంట్ గా ఈ సినిమా సిక్వెల్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

Godavari Sequel : శేఖర్ కమ్ముల తీసిన సినిమాలలో గోదావరి మూవీ.. అందరికి ఆల్ టైం ఫేవరేట్ అని చెప్పి తీరాల్సిందే. ప్రతి ఒక్కరికి ఇది కంఫర్ట్ మూవీ. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు ప్రతి ఒక్కరి ఫేవరేట్ ఆల్బమ్ అయిపోయాయి. అయితే రీసెంట్ గా ఈ సినిమా సిక్వెల్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

  • Published May 21, 2025 | 10:57 AMUpdated May 21, 2025 | 10:57 AM
గోదావరి 2 గురించి హింట్ ఇచ్చినట్లేనా..

టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల సినిమాలాకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ డైరెక్టర్ తీసే ప్రతి సినిమా కూడా ఎంగేజింగ్ గానే ఉంటుంది. అందుకే సినిమాలు తీయడం కాస్త లేట్ అయినా సరే ఆడియన్స్ అంచనాలను ఎక్కడ తగ్గనివ్వడు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే శేఖర్ కమ్ముల తీసిన సినిమాలలో గోదావరి మూవీ.. అందరికి ఆల్ టైం ఫేవరేట్ అని చెప్పి తీరాల్సిందే. ప్రతి ఒక్కరికి ఇది కంఫర్ట్ మూవీ. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు ప్రతి ఒక్కరి ఫేవరేట్ ఆల్బమ్ అయిపోయాయి. అయితే రీసెంట్ గా ఈ సినిమా సిక్వెల్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా సుమంత్ చేసిన అనగనగ మూవీకి OTTలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూస్తూనే ఉన్నాము. అసలు ఇలాంటి సినిమాలు కదా సుమంత్ చేయాల్సింది అని అంతా సుమంత్ ను కొనియాడుతున్నారు. ఈ క్రమంలో ఓ సందర్భంలో సుమంత్ గోదావరి 2 చేయాలనీ ఫ్యాన్స్ అడుగుతున్నారని.. అందుకే శేఖర్ కమ్ములతో టచ్ లో ఉంటానని చెప్పుకొచ్చారు. నటుడిగా ఓ డైరెక్టర్ ను అవకాశాలు అడగడంలో తప్పు లేదని అన్నారు సుమంత్. ఆల్రెడీ సుమంత్ కి శేఖర్ కమ్ములతో వర్క్ చేసిన అనుభవం ఉంది కాబట్టి .. ఒకవేళ సుమంత్ అడిగితే శేఖర్ కమ్ముల దీని గురించి ఆలోచించే అవకాశం లేకపోలేదు. సో ఇప్పుడు గోదావరి 2 చేయాలా వద్దా అనే డెసిషన్ శేఖర్ కమ్ములదే.

ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే కనుక.. కచ్చితంగా ఇండస్ట్రీలో మరో క్లాసిక్ హిట్ వచ్చినట్లే. ఎందుకంటే గోదావరి సినిమాకు ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో కుబేర సినిమాతో బిజిగా ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అనేది ఇంతవరకు అయితే బయటకు రాలేదు. సో త్వరలో గోదావరి సిక్వెల్ పై ఏదైనా న్యూస్ చెప్తారేమో చూడాలి. మైరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.