iDreamPost
android-app
ios-app

బంగ్లాదేశ్ అల్లర్లకు కారణం? ప్రధాని రాజీనామా దేనికి? అసలు ఏమి జరిగిందంటే?

Bangaldesh PM Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఆందోళనకారులు నిరసనలు తీవ్ర రూపందాల్చడంతో ఆమె తప్పక రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు బంగ్లాదేశ్ రావణకాష్టంలాగా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి?

Bangaldesh PM Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఆందోళనకారులు నిరసనలు తీవ్ర రూపందాల్చడంతో ఆమె తప్పక రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు బంగ్లాదేశ్ రావణకాష్టంలాగా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి?

బంగ్లాదేశ్ అల్లర్లకు కారణం?  ప్రధాని రాజీనామా దేనికి? అసలు ఏమి జరిగిందంటే?

కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ రావణ కాష్టంలా తగలబడుతోంది. కొన్నినెలల నుంచి విద్యార్థులు రోడ్లపై కి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. వారి భవిష్యత్ కోసం చేస్తున్న ఈ పోరాటంలో వారితో పాటు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఒక వైపు ప్రాణాలు పోతున్నా..తమ పోరాటం విషయంలో అక్కడి యువత ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తమపైకి తూటలు దూసుకొస్తున్నా కూడా ఆందోళనలను ఆపలేదు. ఇక వారి నిరసనలు ఏ స్థాయికి చేరాయి అంటే.. ఏకంగా ఆ దేశ ప్రధాని రాజీనామా చేసేలా చేశాయి. ఇంతలా బంగ్లాదేశ్ అగ్నిగుండాల మారడానికి అసలు కారణలు ఏమిటి? విద్యార్థులు ఆ స్థాయిలో ఆగ్రహజ్వాలు చిమ్మడం వెనకున్న వారి వేదన ఏంటి? పూర్తి స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం…

భారత దేశం నుంచి విడిపోయిన దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. తొలుత పాకిస్థాన్ తో కలిసి ఒక దేశంగా విడిపోగా.. ఆ తరువాత 1971లో స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఆ సమయంలో బంగ్లాదేశ్ స్వాతంత్రం సంపాదించేందుకు ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్లను కల్పించింది. మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 30 శాతం రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రిజర్వేషన్లను తగ్గించాలంటూ చాలా ఏళ్ల నుంచి విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యలో కొన్నాళ్లపాటు ఆ రిజర్వేషన్లను పక్కనపెట్టారు.

BAngladesh

అయితే.. ఇటీవలే బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరిగి ఆ రిజర్వేషన్లను తీసుకోచ్చింది. దీంతో జూలై 1వ తేది నుంచి మరోసారి ఆందోళనకు దిగారు. బంగ్లాదేశ్ లో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ఎంతో మంది రిజర్వేషన్ల కారణంగా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇలా వారు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలోనే హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ ఉద్యోగాల రిజర్వేషన్ల విధానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నిరసనలు చేపట్టారు. అంతేకాక విద్యార్థులు రోడ్లు, రైల్వే లైన్లను అడ్డుకోవడం, దిగ్బంధనాలను చేయడం ప్రారంభించారు. ఈ నిర్ణయం హసీనా పాలక అవామీ లీగ్ విధేయులకు అనుకూలంగా ఉందని నిరసనకారులు పేర్కొన్నారు.

ఆ తరువాత జూలై 16వ తేదీన ఢాకాలో నిరసనకారులు, ప్రభుత్వ అనుకూల మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ అల్లర్లలో ఏకంగా ఆరుగురు మరణించారు. రిజర్వేషన్ల ఆందోళనల్లో తొలిసారి హింస చెలరేగి ప్రాణనష్టం జరగింది. ఈ క్రమంలోనే ఆందోళలను నివారించేందుకు ప్రధాని హసీనా చేసిన విజ్ఞప్తిని విద్యార్థులు తిరస్కరించారు. ఇదే సమయంలో ప్రభుత్వ భవనాలతో పాటు బంగ్లాదేశ్ టెలివిజన్ ప్రధాన కార్యాలయాన్ని తగులబెట్టారు. ఆందోళన కారులను అదుపులోకి తెచ్చేందుకు అరికట్టేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్ బ్లాక్‌ అవుట్ విధించింది. కర్ఫ్యూ, సైనికుల మోహరింపు ఉన్నప్పటికీ ఘర్షణలు చోటుచేసుకుని దాదాపు 80 మందికి పైగా మరణించారు. అంతేకాక వందల మంది గాయపడ్డారు.

ఇదే సమయంలో జులై 21వ తేదీన బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు.. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో అప్పటి వరకు ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు, నిరసన కారులు కాస్త శాంతిచారు. కానీ.., ఈ కోర్టు తీర్పు ఆ దేశంలో ఎంతోకాలం శాంతిని నిలబెట్టలేకపోయింది. నిరుద్యోగ సమస్యతో అప్పటికే యువతలో అసహనం పెరిగిపోయి ఉండటంతో మళ్ళీ తక్కువ సమయంలోనే అనగా.. ఆగష్టు 4వ తేదీన మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సమయంలో విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రభుత్వ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరిగిన అల్లర్లలో దాదాపు 110 మందికి పైగా మరణించారు. మొత్తంగా జూలై 16న ప్రారంభమైన ఈ హింసాకాండలో 300 మందికి పైగా మరణించగా.. వందలాది మంది గాయపడ్డారు.

ఈ క్రమంలోనే రిజర్వేషన్ల విషయంలో జరుగుతోన్న నిరసనల కారణంగా శాంతి భద్రతలు అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్‌ హసీనాకు బంగ్లా సైన్యం హెచ్చరించింది. ఒకవైపు దేశ యువత నుండి తిరగబాటు, మరోవైపు 15 ఏళ్లుగా తనతో కలిసి పని చేస్తున్న అధికారుల నుండి సహకారం అందకపోవడం, ఒక్కసారిగా సైన్యం రంగంలోకి దిగడంతో ప్రధాని హసీనాకి రాజీనామ చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఇలా ఒక్క రిజర్వేషన్లల కారణంగా కొన్ని నెలల కాలంలోనే బంగ్లా తలరాత మారిపోయింది. మరి.. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.