Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌కు సంబంధించి వైకాపా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపుకు అదనపు గైడ్ లైన్స్ విడుదల చేసింది. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనలతో బుధవారం ఈ కొత్త మార్గదర్శకాలను వెల్లడించింది. మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నూతన సడలింపులు:
వ్యవసాయ రంగం,హార్టికల్చర్ పనులకు మినహాయింపు.
ప్లాంటేషన్ పనులు,కోత ప్రాసెసింగ్,ప్యాకింగ్,మార్కెటింగ్‌కు వెసులుబాటు.
ఆర్థిక రంగానికి మినహాయింపు .
గ్రామీణ ప్రాంతాలలో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు అనుమతి.
కొన్ని అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు అనుమతి.
కరోనా లక్షణాలు లేని వలస కార్మికులకు రాష్ట్ర పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతించడం
వలస కార్మికులు లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రంలో ఉంటే పనులు చేసుకొనేందుకు అనుమతించడం.
బుక్స్ షాపులకు,ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు.
ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు.
మాల్స్ మినహా గ్రామీణ ప్రాంతంలో ఉంటే షాపులు,మార్కెట్ కాంప్లెక్స్‌లు తెరవడానికి అనుమతి.