కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా తెలంగాణ నుంచి వస్తున్న ఆంధ్రాప్రాంతం వాళ్లను కూడా రాష్ట్రంలోకి అనుమతించలేకపోవడం బాధకలిగించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండకపోతే కరోనాను నియంత్రించలేమని స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలో ఉన్న వారు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ప్రజలనుద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాలాంటి వైరస్ వందేళ్లకు ఓ సారి వస్తుందేమో.. జీవితంలో ఒక జనరేషన్ ఒకసారి చూస్తారేమో.. ఇలాంటి వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, అలా ఎదుర్కోలేకపోతే భావితరాలపై ఆ ప్రభావం పడుతుందన్నారు.
కేవలం క్రమశిక్షణతోనే మనం కరోనాను గెలవగలం. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో స్వయంగా ఫోన్ లో మాట్లాడానని, ఈ ఆపద సమయంలో హైద్రాబాద్ లో హాస్టళ్లలో ఉన్న ఆంధ్రా ప్రాంత విద్యార్దులతో పాటు అక్కడ ఇబ్బందులు ఆంధ్రా ప్రాంత వాసులందరిని సహృదయంతో ఆదుకుంటామని అటువంటి వారికి భోజన వసతులు తో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని జగన్ తెలిపారు.
కరొనా పై పోరాడడంలో వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు ఏఎన్ఎమ్, ఆశా వర్కర్లు, అంగన్ వాడి వర్కర్లు, గ్రామ వాలంటీర్లు చేస్తున్న సేవలు నిజంగా అభినందనీయం అని.. ఇది మంచి సత్ఫలిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంల పౌరలందరూ భాద్యాతయుతంగా వ్యవహరించాలని జగన్ మొహాన్ రెడ్డి విజ్నప్తి చేశారు. కాగా వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా పరిమిత సంఖ్యలో వ్యవసాయ పనులు చేసుకోవచ్చని జగన్ మోహన్ రెడ్డి సూచించారు.