iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ పరిస్థితుల్లో ముందుండి నడిపిస్తున్న అనిల్ యాదవ్

  • Published Mar 26, 2020 | 2:36 PM Updated Updated Mar 26, 2020 | 2:36 PM
లాక్ డౌన్ పరిస్థితుల్లో ముందుండి నడిపిస్తున్న అనిల్ యాదవ్

కరోనా నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన వేల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ప్రకటించాక నెల్లూరులో వాటి అమలు తీరును గమనించటానికి సిటీ ఎమ్మెల్యే & ఇరిగేషన్ మినిష్టర్ అనిల్ కుమార్ యాదవ్ , రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా నెల్లూరు పట్టణంలో పర్యటించారు .

టౌన్ లో ఉన్న ఉన్న పాఠశాలల్లో విశాల ప్రాంగణం ఉన్న వాటిని ఎంచుకొని ప్రతి వార్డ్ కి రెండు చొప్పున రైతు బజార్లను కూరగాయల కోసం ఏర్పాటు చేయగా వాటిలో సోషల్ డిస్టెన్స్ కోసం దగ్గరుండి మార్కింగ్ పనులను పర్యవేక్షించిన అనిల్ కుమార్ తరువాత టౌన్ లో నిత్యావసరాల కోసం వెసులుబాటు కల్పించిన దుకాణాల వద్ద సోషల్ డిస్టెన్స్ మార్కింగ్ , సానిటైజేషన్ విధానాలను పరీక్షించి తగు సూచనలు చేశారు .

అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో హోటల్స్ పై ఆధారపడే వారి కోసం కొన్ని ఫుడ్ సెంటర్స్ ఓన్లీ పార్సిల్ ఫెసిలిటీతో ఏర్పాటు చేయగా వాటిని తనిఖీ చేసి పార్సిల్ డెలివరీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆదేశాలిచ్చారు .

తదనంతరం పట్టణంలో vrc సెంటర్లో పర్యటించిన ఇరువురు ఎమ్మెల్యేలు కనపడ్డ ప్రజల్ని వారి అవసరాలు కనుక్కుని అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని , మాస్క్ , సోషల్ డిస్టన్స్ పాటించమని సూచనలు చేసి పంపారు.

చివరిగా పట్టణంలో పలుచోట్ల విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల్ని కలిసి వారికి సానిటయిజర్ , మాస్క్ ల లభ్యతలో , విధి నిర్వహణలో ఏమైనా లోపాలున్నాయేమో కనుక్కుని కరోనా నియంత్రణలో వారి కృషిని మెచ్చుకొన్నారు .

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన నియోజకవర్గ ప్రజలకు చిన్న సమస్య వచ్చినా ముందుండి పోరాడి రెబెల్ ఎమ్మెల్యే అని పేరు తెచ్చుకున్న అనిల్ కుమార్ వైసీపీ అధికారంలోకి వచ్చి ఇరిగేషన్ మంత్రిగా భాద్యతలు శ్వీకరించిన తరువాత సైతం అవకాశం చిక్కిన ప్రతిసారీ తన నియోజక వర్గంలో స్వయంగా పర్యటించడానికి ఆసక్తి చూపడం విశేషం .