iDreamPost
android-app
ios-app

Anasuya Bharadwaj: ట్రోలర్స్ కు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్! గట్టిగా ఇచ్చి పడేసింది!

  • Published Jun 24, 2024 | 4:51 PMUpdated Jun 24, 2024 | 4:51 PM

యాంకర్, నటి అనసూయ చాలాకాలం తర్వాత బుల్లితెర పై మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ షోలో అలరించినుంది. అయితే ఆ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. కాగా, ఆ ప్రోమోలో అనసూయ చేసిన పనికి నెట్టింట ఆమె పై విమర్శలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నెటిజన్ కామెంట్స్ కు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

యాంకర్, నటి అనసూయ చాలాకాలం తర్వాత బుల్లితెర పై మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ షోలో అలరించినుంది. అయితే ఆ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. కాగా, ఆ ప్రోమోలో అనసూయ చేసిన పనికి నెట్టింట ఆమె పై విమర్శలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నెటిజన్ కామెంట్స్ కు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

  • Published Jun 24, 2024 | 4:51 PMUpdated Jun 24, 2024 | 4:51 PM
Anasuya Bharadwaj: ట్రోలర్స్ కు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్! గట్టిగా ఇచ్చి పడేసింది!

‘అనసూయ భరధ్వాజ్’.. ఈ పేరకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అలాగే ఈ పేరుకు ఉన్నా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఒక న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ ఆ తర్వాత యాంకర్ గా, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పలు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించి స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ముఖ్యంగా అందం, అభినయం రెండు ఉన్న కలిగిన అనసూయ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇకపోతే తరుచు వివదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది అమ్మాడు.ముఖ్యంగా ఆమె గ్లామరెస్ డ్రెస్ లతో తరుచు ట్రోలింగ్ బారిన పడతుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ మరోసారి ట్రోలింగ్ గురైంది. గతకొన్ని రోజులుగా వెండితెరపై అలరిస్తూ బుల్లితెరకు దూరమైన అనసూయ.. ఈ మధ్యనే మళ్లీ బుల్లితెరపై మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ సందర్భంగా.. బుల్లితెరపై సడన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన అనసూయ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా, ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రోమోలోని శేఖర్ మాస్టర్, అనసూయ ఇద్దరూ ఏదో పోటీకి రెడీ అవుతున్నట్లు కనిపిస్తారు. ఈ క్రమంలోనే అనసూయ అందరి ముందు తన జాకెట్ విప్పేసింది. ఇది చాలా హాట్ గా చూపించారు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ కూడా తన షర్ట్ విప్పేయడం జరుగుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ అనసూయని దారణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే అనసూయ కూడా తగ్గేదేలే అన్నట్టుగా.. ఈ కామెంట్స్ కు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ నెటిజన్ ఇది నిజంగా నాన్ సెన్స్.. ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది అని పోస్ట్ పెట్టాడు.

Anasuya

ఇక ఆ కామెంట్ కు స్పందించిన అనసూయ.. ‘మీరు పెట్టిన ఎమోజిలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే.. ఎందుకో మీరు ఇంతా రోగంతో బాధపడుతున్నారో అనిపిస్తోంది’ అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే మరో నెటిజన్ మీకు నిజంగా అర్థం కావట్లేదా అండి.. ఎలా ఉండే షోలు ఎలా అవుతున్నాయి. మీ పాత్ర మంచిగా ఉండాలి కానీ బ్యాడ్ వైపు వెళ్ళకూడదు. నటిగా మీరంటే చాటా ఇష్టం. కానీ, ఇలాంటివి చేయకపోతే మంచిది అని కామెంట్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ కు కూడా అనసూయ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిది. ‘ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులుగా మేము కొన్ని విషయాలని ఎక్స్ ప్లోర్ చేయాలి. అలాగే ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా కొన్ని మార్పులు తప్పవు. కానీ, మీరంతా ఇలా బుల్లితెర మీదే ప్రతాపం చూపిస్తారు.

అయితే సినిమాల్లో అభ్యంతరకరమైనవి ఎన్ని వస్తున్నా మీరు బ్లాక్ బస్టర్ హిట్స్ చేసేస్తారు. కానీ, బుల్లితెరపై ప్రోమోలు చూసి జడ్జిమెంట్ చేసేస్తారు. కొందరికి ప్యాంట్స్, షర్ట్స్ కూడా ఇబ్బందే.. నేనేం చెప్పానో అర్థం అయింది అనుకుంటా’ అంటూ అనసూయ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ నెటిజన్స్ కు ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనసూయ ‘పుష్ప 2’లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి, ప్రస్తుతం అనసూయ నెటజన్స్ కు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి