Idream media
Idream media
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో మెగా హీరో అల్లు అర్జున్, పూజా హెగ్దే జంటగా నటించిన సినిమా అల వైకుంఠపురంలో.. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతేకాదు.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. అమెరికాలో మూడు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దుమ్ములేపింది. సినిమాలోని కంటెంట్ తో పాటుగా యూనిట్ కష్టపడి చేసిన పబ్లిసిటీకి తగ్గట్టుగా ఫలితాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో వేసిన ప్రచార పోస్టర్ లో జనవరి 11 నుంచి యూఎస్ ప్రీమియర్ మొదలు అని ఉండగా దాని కిందే ఈ సినిమా మీకు Amazon prime , Netflix లో అందుబాటులో ఉండదు అంటూ ప్రచారం చేసారు.
డిజిటల్ మీడియా ప్రభావం పెరిగాక నెట్ ఫ్లిక్స్ ,అమెజాన్ ప్రైమ్ ద్వారా కోట్లమంది సినిమాలు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలైన నెలరోజులకే “OTT Platforms ”లో ప్రత్యక్షమవుతోంది. ఇక విదేశాల్లో ఉండే భారతీయుల్లో ఎక్కువ మంది థియేటర్ లో కన్నా ఇంట్లో రాత్రి సమయాల్లో OTT Platforms లో సినిమా చూసేస్తారు.. కాబట్టి ఎక్కువమంది పేక్షకులను థియేటర్ లకు రప్పించటానికే Amazon prime , Netflix స్ట్రీమ్ అవ్వదని ప్రచారం చేసారు.
విడుదలైన మొదటి ఆటనుంచే పాజిటీవ్ టాక్ రావటంతో OTT లో రెండు నెలల తరువాత ప్రసారమయ్యేంత వరకు ఆగకుండా ఎక్కువ మంది సినిమా చూడడానికి థియేటర్లకు వెళ్లారు. కట్ చేస్తే ఇవాళ (గురువారం) నుండి SunNxt లో అల వైకుంఠపురంలో సినిమా స్ట్రీమింగ్ అయిపోతోంది. సర్లే ముందు నుండి ఇది తెలిసిన విషయమే కదా అనుకుంటే ఈసినిమా Netflix లో కూడా స్ట్రీమ్ అవుతోంది.
ఈ సినిమాని Netflix లో చూసి ఆశ్చర్యపోతున్నవారంతా మమ్మల్ని థియేటర్లకు రప్పించడంకోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారా అంటూ సినిమా యూనిట్ పై ఫైరవుతున్నారు. అయితే తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసమే సదరు రెండు సంస్థలతోనూ ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్న విషయాన్ని బ్లూ స్కై సినిమాస్ వెల్లడిస్తోంది. సినిమా ప్రమోషన్ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటామని మరోసారి ఇలా జరగనీయమని బ్లూ స్కై సినిమాస్ ప్రకటనను విడుదల చేసింది.