iDreamPost
android-app
ios-app

Ravi Teja In AHA : రవితేజతో బాలకృష్ణ ‘వార్’.. ఆహా ముగించేసిందిగా!

Ravi Teja In AHA : రవితేజతో బాలకృష్ణ ‘వార్’.. ఆహా ముగించేసిందిగా!

ఇండస్ట్రీలో ఒకసారి ఒక పుకారు వచ్చిందంటే అది చిలికి చిలికి గాలివానలా మారుతుంది. చిన్న విషయం పెద్దగా బయటకు వస్తుంది. రవితేజ, బాలయ్య విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ ఇద్దరి మధ్య అప్పుడెప్పుడో 15 ఏళ్ళ కింద ఓ విషయంలో గొడవ జరిగిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తాయి. వీరిద్దరూ ఎక్కడా మాట్లాడుకోవడం కానీ కలుసుకోవడం కానీ జరగలేదు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ అనూహ్యంగా బాలయ్య, రవితేజ సినిమాలే బాక్సాఫీస్ దగ్గర పోటీకి వస్తుంటాయి.

ఒక్కో సారి ముందు రవితేజ తన సినిమాలను అనౌన్స్ చేస్తే.. ఆ తర్వాత బాలయ్య వస్తుంటాడు. మరోసారి బాలయ్య తన సినిమా విడుదల తేదీ ఖరారు చేసిన తర్వాత తన సినిమాలను తీసుకొస్తుంటాడు. నిజానికి అఖండ విషయంలో కూడా అలాగే జరగాల్సింది. క్రాక్ సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్న రవితేజ.. అదే ఊపులో ఖిలాడి సినిమాతో మే 28న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. బాలయ్య అఖండ సినిమా కూడా మే 28నేఅనౌన్స్ చేశారు. అనుకోకుండా కరోనా సెకండ్ వేవ్ వలన రెండు సినిమాలు రిలీజ్ కాలేదు అనుకోండి అది వేరే విషయం. అయితే ఈ పోటీ చూస్తే అప్పుడెప్పుడో వచ్చిన పుకార్లు నిజమే అనే అనుమానం కలగక మానదు.

అయితే అల్లు అరవింద్ కు చెందిన ఆహా యాప్ కోసం అన్ స్టాప్ బుల్ అనే షో చేస్తున్నారు. ముందు నుంచి కాస్త ఎక్స్పెక్ట్ చేసిన గెస్టులతో షో చేసిన బాలకృష్ణ ఇప్పుడు మాత్రం ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం లాంటి తారలను తీసుకొచ్చారు. త్వరలోనే ఈ షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించబోతున్నారు. ఈ ఎపిసోడ్ ని సీజన్ లాస్ట్ లో టెలికాస్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. మాస్ మహారాజా రవితేజ గెస్ట్ గా ఒక ఎపిసోడ్ షూట్ జరిగింది. రవితేజతో పాటు గోపీచంద్ మలినేని కూడా ఈ షోకి గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో బాలయ్య, రవితేజ.. తమ ఇద్దరి వివాదం అంటూ వచ్చిన రూమర్స్ పై స్పందిస్తారో లేదో చూడాలి. ఇటీవల ‘అఖండ’తో హిట్ అందుకున్న బాలయ్య తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే క్రాక్ సినిమాతో అటు గోపీచంద్, ఇటు రవితేజ ఇద్దరూ ఒకేసారి ఫాంలోకి వచ్చారు. మరి వీరి కలయిక వెనుక ఉన్న వ్యక్తి ఆయనేనేమో మరి.

Also Read : అభిమానుల హృదయంలో చెరగని ముద్ర వేసిన “RAPO”