Aditya N
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రంలోని పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రంలోని పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Aditya N
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని మొదటి పాట ‘జరగండి’. గతంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ పాటను విడుదల చేస్తామని ప్రకటించినా.. కొన్ని కారణాల వల్ల పాట విడుదల కాలేదు. దాంతో అప్పటి నుంచీ ఈ పాట ఎప్పుడు వస్తుందా అని రామ్ చరణ్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఆశలు నిజం అయ్యాయి. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఉదయం 9 గంటలకు “జరగండి” పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కాగా ఈ పాట హై-ఎనర్జీ బీట్స్ తో పాటు ఫన్నీ లిరిక్స్ ను కలిపి ఒక ఉత్తేజకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. గతంలో ఈ పాట లీక్ అయినా అది కేవలం ఫస్ట్ వెర్షన్ అని, రేపు విడుదలయ్యే పాటలో క్వాలిటీ ఇంకా బాగుంటుందని అంటున్నారు. ఈ పాట విడుదల అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని కలిగించి, సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేస్తుందని చిత్ర నిర్మాతలు ఆశిస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ నందన్ అనే IAS అధికారి పాత్రలో కనిపిస్తారట. శంకర్ గ్రాండియర్ కు తోడు ప్రేక్షకులని కదిలించే ఎమోషన్స్, కళ్ళు చెదిరే విజువల్స్ సినిమాలో ఉంటాయట. ఆకట్టుకునే కథాంశంతో పాటు హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లు, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ కూడా గేమ్ ఛేంజర్ లో ఉంటాయని గట్టి టాక్ వినిపిస్తుంది.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా జరగండి పాట గురించి ఇదివరకే బాగా హైప్ చేశారు. రామ్ చరణ్ అభిమానులకు ఈ పాట ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన అన్నారు. ఇక శంకర్ అంటేనే అద్భుతమైన సాంగ్స్ కు పెట్టింది పేరు. రామ్ చరణ్ – కియారా అద్వానీ లు జంటగా కనిపించనున్న “జరగండి” పాటకి భారీగానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. సెట్స్ గ్రాండ్ లెవెల్ లో ఉంటాయని, పాటని విన్నప్పటి కంటే స్క్రీన్ మీద చూసినపుడు మరింత ఆశ్చర్యపోతారని అంటున్నారు. మరి రేపు ఉదయం విడుదల కానున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని మొదటి పాట ‘జరగండి’ అందరి అంచనాలను అందుకోవాలని ఆశిద్దాం.