iDreamPost
android-app
ios-app

మాస్క్ లేకుండా ప్రజలు బయటకు వస్తే 1000 జరిమానా

మాస్క్ లేకుండా ప్రజలు బయటకు వస్తే 1000 జరిమానా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు విస్తరిస్తున్నాయి..
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో పాటూ నర్సరావుపేటలో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు.. లాక్‌డౌన్‌ మరింత కఠినంగా గా అమ‌లు చేయాలని నిర్ణయించారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎవ‌రైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ. 1000 జరిమానా విధిస్తామంటున్నారు. ఇక కూరగాయలు, నిత్యావ‌సరాలు కొనుగోలు చేసేందుకు ఒక్కరే రావాలని సూచించారు. గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులు ఉదయం 10 గంటలలోపు ఆఫీసుల‌కు చేరుకోవాలని.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు రోడ్లపైకి ఉద్యోగులను అనుమతించేది లేద‌ని వెల్లడించారు.

ఉద్యోగులు గుర్తింపు కార్డులను చూపించి కలెక్టరేట్‌లో పాసులు పొందాలని, ప్రజలంతా ఆరోగ్య సేతు యాప్‌ను అండ్రాయిడ్‌ ఫోన్లలో డౌన్లోడ్‌ చేసుకుని వైద్యారోగ్యశాఖ అందించే ముందస్తు జాగ్రత్త చర్యలను తెలుసుకోవాలని సూచించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ లో 338 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 6 వైరస్ నుండి కోలుకున్నారు.. నలుగురు మృత్యువాత పడ్డారు.. దేశంలో 5,865 మంది వైరస్ బారిన పడగా 169 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు..