P Krishna
Delhi Crime News: ఈ మధ్య కాలంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ప్రేమ పేరుతో రిలేషన్ కొనసాగించి అవసరం తీరిన తర్వాత దారుణంగా హతమార్చుతున్నారు. ఢిల్లీలో ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి.
Delhi Crime News: ఈ మధ్య కాలంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ప్రేమ పేరుతో రిలేషన్ కొనసాగించి అవసరం తీరిన తర్వాత దారుణంగా హతమార్చుతున్నారు. ఢిల్లీలో ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి.
P Krishna
గత కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతుంది. ప్రేమ పేరుతో రిలేషన్ లో ఉంటూ.. పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే యువతులను దారుణంగా హత్య చేస్తున్నారు. గతంలో అఫ్తాబ్ అమీన్ అనే యువకుడు శ్రద్ద అనే యువతితో సహజీవనం చేశాడు. కొంత కాలం తర్వాత శ్రద్ద తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో దారుణానికి తెగబడ్డాడు. ఆ యువతిని ముక్కలు ముక్కలుగా కోసి.. నగరమంతా విసిరేశాడు.అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. తాజాగా ఢిల్లీలో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పశ్చిమ ఢిల్లీకిచెందిన సోనీ (19) సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేది. సోనీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 6 వేల మంది వరకు ఫాలోవర్లకు ఉన్నారు. ఈ క్రమంలోనే సంజు అలియాస్ సలీమ్ అనే యువకుడికి పరిచయం అయ్యింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వచ్చింది సోనీ. కొంత కాలం ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే సోనీ గర్భవతి అయ్యింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని కొన్నిరోజులుగా సంజుని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. ఇదే విషయంలో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరగడం మొదలయ్యాయి. ప్రస్తుతం సోనీ ఏడు నెలల గర్భవతి.అబార్షన్ చేయించుకోమని చెప్పాడు. కానీ ఆమె మాత్రం తనను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టింది. దీంతో సోనీ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలోనే సంజూ తన ప్లాన్ గురించి స్నేహితులైన హృతిక్, పంకజ్‌లతో చెప్పాడు. వారికి కొంత డబ్బు సాయం కూడా ఇస్తానని చెప్పాడు. ముగ్గురూ కలిసి సోనీని కర్వా చౌత్ రోజున చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఓ అద్దె కారు తీసుకున్నారు. సోనీకి ఇద్దరం పెళ్లి చేసుకుందాం.. కొంత డబ్బు తీసుకురావాలని ఫోన్ చేసి చెప్పాడు సంజూ. ఇవేవీ తెలియని సోనీ అమాయకంగా నమ్మి వచ్చింది. ఆమెను కారు ఎక్కించుకొని హర్యానాలోని రోహ్‌తక్ సమీపంలోకి రాగానే గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత రోహ్‌తక్‌లోని అడవిలోకి వెళ్లి మృతదేహాన్ని 4 అడుగుల మేర గోయ్యి తీసి అందులో పాతి పెట్టారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో చెప్పాడు సంజు. ఈ నేపథ్యంలోనే సంజుతో పాటు అతడి స్నేహితుడు పంకజ్‌ని అరెస్ట్ చేశారు. హత్యలో భాగం పంచుకు్న హృతిక్ పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా సోనీ సోదరి మాట్లాడుతూ.. అక్కకు సంజుతో ఎఫైర్ ఉంది. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కొంత కాలం రిలేషన్ లో ఉన్నారు. ఆ సమయంలో అక్క గర్భవతి అయింది. మొదట అతనిపై తమ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అతన్నే పెళ్లి చేసుకుంటానని అక్క పట్టుబట్టింది. దీంతో ఆమె మనసు కష్టపెట్టొద్దని పెళ్లికి అంగీకరించారు. అప్పుడే కర్వాచౌత్ వచ్చింది.. ఆ రోజే అక్క ఇంటి నుంచి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు.. ఆమె చనిపోయినట్లు వార్త వచ్చిందని కన్నీరు పెట్టుకుంది. గర్భిణి అని చూడకుండా హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. అయితే పోలీసుల విచారణలో సంజు అసలు పేరు సలీమ్ అని తేలింది. ఈ విషయం సోనీ కుటుంబ సభ్యులకు తెలియదని.. అతడు హిందువుగా భావించి పెళ్లి కూడా చేస్తామని ఒప్పుకున్నారు. కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈ ఘాతుకానికి పాల్పపడినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయే వరకు సోనీ అతడు హిందువుగానే భావించిందని పోలీసులు అంటున్నారు.