ఇండియన్ రైల్వేస్ ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలను తీసుకొస్తూనే ఉంది. ఇక ఇప్పటికే హై స్పీడ్ రైళ్లతో పాటుగా వందే భారత్ లాంటి ప్రతిష్టాత్మక రైళ్లను కూడా ప్రవేశపెట్టింది. తాజాగా మరో అద్భుతమైన పనికి శ్రీకారం చుట్టబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది వలస కార్మికులు ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తుంటారు. ఈ క్రమంలోనే వారు రవాణాలో అనేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యలను పరిష్కరించడం కోసం ఇండియన్ రైల్వేస్ ముందడుగు వేసింది. వలస కార్మికులు, కార్మిక వర్గాల సమస్యను తీర్చడానికి ప్రత్యేకంగా రైళ్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ రైల్వేస్ వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా రైళ్లను నడపాలని భావిస్తోంది. అందులో భాగంగానే తక్కువ ఆదాయ వర్గానికి చెందిన ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వేచి ఉండే రాష్ట్రాల్లొ అధ్యాయనం చేసిన తర్వాత భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా.. నాన్ ఏసీ, జనరల్ కేటగిరీ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. తద్వారా వలస కార్మికుల కష్టాలకు చెక్ పెట్టొచ్చు అన్నది రైల్వేశాఖ ఆలోచన. అయితే ఇలాంటి రైళ్లను పండుగలు లేదా.. పీక్ సీజన్లలో మాత్రమే ప్రారంభించేవారు. కాగా.. ప్యాసింజర్ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండటంతో.. ఈ రైళ్లను శాశ్వతంగా నడపాలని భావిస్తోంది రైల్వే శాఖ.
ఇక జనవరి 2024 నుంచి నడవబోతున్న కొత్త రైళ్లలో నాన్ AC LHB కోచ్ లు ఉంటాయి. వాటితో పాటుగా.. స్లీపర్, జనరల్ కేటగిరీ కోచ్ లు మాత్రమే ఉంటాయి. అయితే ఈ ట్రైన్స్ కు ఇంకా ఎలాంటి పేరు పెట్టలేదు. ఈ రైళ్లను గతంలో కరోనా సమయంలో కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడానికి వినియోగించారు. రైల్వే బోర్డు అందించిన సమాచారం మేరకు.. ఉత్తరప్రదేశ్, బిహార్, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సామ్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలకు కొత్త ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేస్తున్నారు. ఇక వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైన్స్ లో 22 నుంచి గరిష్టంగా 26 కోచ్ లు ఉంటాయని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కాగా.. ఇండియన్ రైల్వేస్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. కొన్ని లక్షల మందికి ఊరట లభించనుంది. మరి రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: ట్రయాంగిల్ లవ్ స్టోరీ! ప్రేమకు అడ్డొస్తున్నాడని స్నేహితుడి దారుణ హత్య..