iDreamPost
android-app
ios-app

ట్రయాంగిల్ లవ్ స్టోరీ! ప్రేమకు అడ్డొస్తున్నాడని స్నేహితుడి దారుణ హత్య..

  • Author Soma Sekhar Published - 10:21 AM, Fri - 21 July 23
  • Author Soma Sekhar Published - 10:21 AM, Fri - 21 July 23
ట్రయాంగిల్ లవ్ స్టోరీ! ప్రేమకు అడ్డొస్తున్నాడని స్నేహితుడి దారుణ హత్య..

ఒకే అమ్మాయిని ఇద్దరు స్నేహితులు ప్రేమించారు. అయితే ఆ అమ్మాయి అందులో ఒక్కరితో చనువుగా ఉంటుందని మరో స్నేహితుడు అతడిని దారుణంగా హత్య చేశాడు. ఇప్పుడు నేను చెప్పింది ఏదో సినిమా స్టోరీ కాదు. నిజంగానే జరిగిన ట్రయాంగిల్ క్రైమ్ లవ్ స్టోరీ. అవును తన ప్రేమకు అడ్డు వస్తున్నాడన్న కోపంతో స్నేహితుడినే దారుణంగా చంపాడు ఓ యువకుడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. అయితే ఈ కేసును ఫిర్యాదు అందిన ఒక్క రోజులోనే పోలీసులు ఛేదించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ సింగ్ అలియాస్ అమర్ నాథ్(21), రాజ్ కపిల్ సాహు(20) ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ బిహార్ నుంచి పనికోసం హైదరాబాద్ కు వలస వచ్చారు. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో వారి మధ్య స్నేహం కుదిరింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ బిహార్ కే చెందిన ఓ యువతిని ప్రేమించారు. కాగా.. ఆ యువతి రాజ్ కపిల్ తో ఎక్కువ చనువుగా ఉండటంతో.. రాహుల్ సింగ్ సహించలేకపోయాడు. దాంతో ఎలాగైనా కపిల్ ను అడ్డుతొలగించుకోవాలని అతడి హత్యకు ప్లాన్ వేశాడు రాహుల్ సింగ్.

పథకంలో భాగంగా.. కొత్తూరుకు చెందిన పాత నేరస్థుడు మహ్మద్ తాహేర్(19), మరో ఇద్దరు మైనర్లతో కలిసి ఈ నెల 18న రాజ్ కపిల్ ను తీసుకెళ్లి మద్యం సేవించారు. అనంతరం బీరు సీసాలతో రాజ్ కపిల్ ను పొడిచి, తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడే అతడిని మట్టిలో పూడ్చిపెట్టారు. కాగా..హెచ్ఐఎల్ పరిశ్రమ కాంట్రక్టర్ సోనూకుమార్ ఈనెల 19న రాజ్ కపిల్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజ్ కపిల్ గదిలో ఉండే స్నేహితులను విచారించగా.. విషయం బయటపడింది. దాంతో రాహుల్ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ప్రేమించిన యువతితో చనువుగా ఉంటున్నాడనే కారణంతోనే చంపినట్లు ఒప్పుకున్నాడు. దాంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదికూడా చదవండి: మణిపూర్ లో స్త్రీలను నగ్నంగా ఉరేగించడంపై ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్!

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet