రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఇక నో టెన్షన్.. వెంటనే అకౌంట్లోకి డబ్బులు

మీరు ట్రైన్ జర్నీ చేసే సమయాల్లో అనివార్య పరిస్థితుల్లో టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? అయితే ఇక టెన్షన్ పడే పరిస్థితి లేదు. టికెట్ క్యాన్సిల్ డబ్బులు వెంటనే అకౌంట్లోకి వస్తాయి. ఎలా అంటే?

మీరు ట్రైన్ జర్నీ చేసే సమయాల్లో అనివార్య పరిస్థితుల్లో టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? అయితే ఇక టెన్షన్ పడే పరిస్థితి లేదు. టికెట్ క్యాన్సిల్ డబ్బులు వెంటనే అకౌంట్లోకి వస్తాయి. ఎలా అంటే?

అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన భారతీయ రైల్వే లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నది. సమయం ఆదా, ప్రయాణ చార్జీలు తక్కువగా ఉండడంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు ట్రైన్ జర్నీకే ఎక్కవగా ఇంట్రస్టు చూపిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాక అనివార్య కారణాల వల్ల టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో టికెట్ క్యాన్సిల్ డబ్బులు రిఫండ్ ఆలస్యమవుతూ ఉంటాయి. దీంతో ప్రయాణికులు అసహనానికి గురవుతుంటారు. ఇకపై మీరు రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే టెన్షన్ పడాల్సిన పనిలేదు. వెంటనే అకౌంట్లోకి డబ్బులు రిఫండ్ అవుతాయి.

రద్దు చేసుకున్న టికెట్ డబ్బులు పొందాలంటే ప్రయాణికులు కొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మేక్ మై ట్రిప్, ఇక్సిగో వంటి కొన్ని ఐఆర్టీసీ లైసెన్స్ పొందిన ఇ-టికెటింగ్ సంస్థలు ప్రయాణికుల నుంచి కొంత అదనపు ఛార్జీని వసూలు చేసి టిక్కెట్ పై ఉచిత రద్దు సౌకర్యాన్ని అందిస్తాయి. టికెట్ బుక్ చేసుకునేటపుడు ఆయా సంస్థలు ఉచిత రద్దు ఆప్షన్ ను అందిస్తాయి. రైలు ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ డబ్బులు వెంటనే పొందాలంటే మేక్ మై ట్రిప్, ఇక్సిగో వంటి ప్లాట్ ఫారమ్ లలో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రిఫండ్ అనేది చార్ట్ రెడీ అయ్యే లోపు క్యాన్సిల్ చేస్తేనే మొత్తం రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది.

రైలు ప్రయాణికులు.. రైలు బయలుదేరే సమయానికి 4 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రైలు స్టార్ట్ అయ్యే నాలుగు గంటల ముందు చార్ట్ తయారు చేయబడుతుంది. ఒక వేళ మీరు ఫ్రీ క్యాన్సిలేషన్ ఆప్షన్ ను ఎంచుకోక పోతే రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే థర్డ్ ఏసీకి 180 మినహాయించబడుతుంది. ఐఆర్టీసీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్‌లను రద్దు చేయాలనుకుంటే ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. రైలు నిర్ణీత సమయానికి కొన్ని గంటల ముందు టిక్కెట్‌ను రద్దు చేస్తే రద్దు ఉచితంగా లభిస్తుంది.

రైలు బయలుదేరడానికి 48 గంటల కంటే ముందుగా ధృవీకరించబడిన టిక్కెట్‌ను రద్దు చేసినట్లయితే.. ఏసీ ఫస్ట్ క్లాస్/ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోసం రూ. 240, ఏసీ 2 టైర్/ఫస్ట్ క్లాస్ కోసం రూ. 200, ఏసీ 3 టైర్/ఏసీ చైర్ కార్/ఏసీ 3 ఎకానమీకి రూ. 180, స్లీపర్ క్లాస్ కోసం రూ. 120, రెండవ తరగతికి రూ. 60 కట్ చేస్తారు. రైలు బయలుదేరడానికి 48 గంటల నుంచి 12 గంటల ముందు టికెట్‌ రద్దు చేసుకుంటే.. మొత్తం ఛార్జీలో 25% డిడక్ట్ అవుతుంది. రైలు బయలుదేరే సమయానికి 12 గంటల నుంచి 4 గంటల ముందు టికెట్లు రద్దు చేసుకుంటే.. అప్పుడు చార్జీలు టికెట్‌ రేటులో 50శాతం ఉంటాయి. అవి కూడా ప్రతి క్లాస్‌ కి ఫ్లాట్‌ క్యాన్సిలేషన్‌ చార్జి కి లోబడి ఉంటాయి.

Show comments