iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ మ్యాచ్​కు ప్రభాస్.. ప్రశాంత్ నీల్ గట్టిగా ప్లాన్ చేశాడుగా!

  • Author singhj Published - 10:08 PM, Fri - 3 November 23

వరల్డ్ కప్​లో భాగంగా భారత్ ఆడే లాస్ట్ మ్యాచ్​కు రెబల్ స్టార్ ప్రభాస్ అటెండ్ అవుతాడని టాక్. ప్రభాస్ రాకపై నెటిజన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

వరల్డ్ కప్​లో భాగంగా భారత్ ఆడే లాస్ట్ మ్యాచ్​కు రెబల్ స్టార్ ప్రభాస్ అటెండ్ అవుతాడని టాక్. ప్రభాస్ రాకపై నెటిజన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

  • Author singhj Published - 10:08 PM, Fri - 3 November 23
వరల్డ్ కప్ మ్యాచ్​కు ప్రభాస్.. ప్రశాంత్ నీల్ గట్టిగా ప్లాన్ చేశాడుగా!

మన దేశంలో ప్రజలకు ఎంటర్​టైన్​మెంట్ అంటే వెంటనే సినిమా, క్రికెట్టే గుర్తుకొస్తాయి. మూవీస్​ అంటే పడిచచ్చే వాళ్లు ఇక్కడ కోట్లలో ఉన్నారు. క్రికెట్​ అంటే ఇష్టపడేవాళ్లు, క్రికెటర్లను ఫాలో అయ్యేవాళ్లూ అంతే సంఖ్యలో ఉన్నారు. కాస్త గ్యాప్ దొరికినా సినిమాకు వెళ్లిపోవడం, వీకెండ్స్​లో ఫ్యామిలీతో కలసి మూవీస్​ చూస్తూ ఎంజాయ్ చేయడం ఇక్కడి లైఫ్​స్టైల్​లో ఒక భాగమనే చెప్పాలి. ఇక, భారత టీమ్ ఎప్పుడు మ్యాచ్ ఆడుతున్నా కోట్లాది మంది ప్రేక్షకులు తమ ఫోన్లు, టీవీలకు అతుక్కపోతారు. మ్యాచ్ అయ్యే వరకు ఎన్ని పనులున్నా పోస్ట్​పోన్ చేసుకుంటారు. అంతలా క్రికెటర్లు, సినీ స్టార్లు తమ ప్రభావం చూపిస్తున్నారు.

క్రికెటర్లు నటిస్తే చూడాలని చాలా మంది అనుకుంటారు. అదే టైమ్​లో మూవీ స్టార్స్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్​లోకి దిగితే చూడాలనీ కోరుకుంటారు. అందుకే సినీ తారల మధ్య కూడా లీగ్స్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆడే మ్యాచులకు సినీ తారలు అటెండ్ అవుతుండటం కామనే. వరల్డ్ కప్ లాంటి బడా టోర్నీలో భారత్ ఆడే మ్యాచులకు విక్టరీ వెంకటేష్​తో పాటు రజినీకాంత్, ఆమిర్ ఖాన్ లాంటి బడా స్టార్లు అటెండ్ అవ్వడం చూసే ఉంటారు. ఈసారి కూడా వెంకీ మామ భారత మ్యాచ్​లకు హాజరవుతూ టీమ్​ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో భారత మ్యాచ్​కు రానున్నారని తెలుస్తోంది.

వన్డే వరల్డ్ కప్​-2023లో భాగంగా గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్​లో నెదర్లాండ్స్ టీమ్​తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్​కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రానున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తన కొత్త మూవీ ‘సలార్’ ప్రమోషన్స్​ను ఇక్కడి నుంచే డార్లింగ్ మొదలుపెట్టనున్నారని టాక్. ఈ న్యూస్ విన్న ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ప్రభాస్​ను గ్రౌండ్​లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘సలార్’ ప్రమోషన్స్​ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గట్టిగానే ప్లాన్ చేశాడుగా అని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ ఐడియా సూపర్ అని.. ప్రభాస్ మ్యాచ్​కు వస్తే ‘సలార్’పై హైప్ ఇంకా పెరుగుతుందని నెటిజన్స్ అంటున్నారు. ప్రమోషన్లలో మరింత స్పీడ్ పెంచాలని.. అప్పుడే ఎక్స్​పెక్టేషన్స్ ఇంకా ఎక్కువవుతాయని సూచిస్తున్నారు. అయితే భారత మ్యాచ్​కు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తాడనే దానిపై ఇంకా అఫీషియల్​గా కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఒకవేళ ఆయన మ్యాచ్​కు వస్తే మాత్రం మామూలుగా ఉండదు. స్టేడియంలోని కెమెరాలన్నీ ప్రభాస్ మీదే ఉంటాయని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. భారత్​ మ్యాచ్​కు ప్రభాస్ వస్తే ఎలా ఉంటుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మంచి మనసు చాటుకున్న రోహిత్.. అభిమాని కోసం ఏకంగా..!

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş