iDreamPost
android-app
ios-app

మంచి మనసు చాటుకున్న రోహిత్.. అభిమాని కోసం ఏకంగా..!

  • Author singhj Published - 09:21 PM, Fri - 3 November 23

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మంచి మనసును చాటుకున్నాడు. ఒక అభిమాని కోసం హిట్​మ్యాన్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మంచి మనసును చాటుకున్నాడు. ఒక అభిమాని కోసం హిట్​మ్యాన్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.

  • Author singhj Published - 09:21 PM, Fri - 3 November 23
మంచి మనసు చాటుకున్న రోహిత్.. అభిమాని కోసం ఏకంగా..!

క్రికెట్​కు మన దేశంలో ఉండే క్రేజ్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. జెంటిల్మన్ గేమ్ అన్నా, క్రికెటర్స్ అన్నా పడిచచ్చే వాళ్లకు ఇక్కడ లెక్కే లేదు. క్రికెటర్లను ఇన్​స్పిరేషన్​గా తీసుకునేవాళ్లు కూడా కోట్లలో ఉన్నారు. అందుకే క్రికెట్ అంటే ఇక్కడ డబ్బులు, ఫేమ్, క్రేజ్ సంపాదించడం వరకు మాత్రమే కాదు.. అదో గౌరవం, ప్రతిష్ట, బాధ్యతలా మారిపోయింది. క్రికెటర్ల జీవితాలను ఎంతో మంది ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ప్లేయర్లు ఆన్ ది ఫీల్డ్​తో పాటు ఆఫ్​ ది ఫీల్డ్ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది గమనిస్తుంటారు. అందుకే ప్లేయర్లు గేమ్​తో పాటు బిహేవియర్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

టీమిండియాకు ఆడే క్రికెటర్లకు ఉండే పాపులారిటీ, రెస్పెక్ట్ వేరే లెవల్లో ఉంటుంది. అలాంటిది భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అంటే ఇంక అర్థం చేసుకోవచ్చు. అందరూ అతడ్ని డేగ కళ్లతో గమనిస్తుంటారు. చిన్న తప్పు చేసినా విమర్శలకు దిగుతారు. ఒకవేళ మంచి పని చేస్తే మాత్రం ప్రశంసల్లో ముంచెత్తుతారు. కాబట్టి భారత కెప్టెన్ అంటే అన్నింటికీ ముందే ఫిక్స్ అయిపోవాలి. అన్నింటినీ సమానంగా తీసుకోగలగాలి. ఆ క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయని ప్రస్తుత సారథి రోహిత్ శర్మ చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు.

అటాకింగ్ గేమ్​తో కోట్లాది మందిని అలరిస్తున్న హిట్​మ్యాన్.. తన చర్యల ద్వారా చాలా మందిలో స్ఫూర్తిని నింపుతున్నాడు. తాజాగా మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు రోహిత్. శ్రీలంకతో మ్యాచ్ తర్వాత ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి పలకరించాడు హిట్​మ్యాన్. ఒక యంగ్ క్రికెటర్​కు సర్​ప్రైజ్ గిఫ్ట్‌ కూడా ఇచ్చాడు. యువ క్రికెటర్ అడగ్గానే తన షూ తీసి ఇచ్చేశాడు రోహిత్. ఫ్యాన్​కు రోహిత్ గిఫ్ట్ ఇస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు.. ప్లేయర్ అంటే ఇలా ఉండాలని, ఇది రోహిత్ మంచి మనసు అని మెచ్చుకుంటున్నారు. మరి.. ఫ్యాన్ కోసం రోహిత్ చేసిన పనిపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: స్టంపౌట్​ను రనౌట్​గా ఇచ్చారు.. ఇదేం అంపైరింగ్ సామి!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet