Aditya N
ఈ పాట హిట్ వారం థమన్ కు ఎంతో అవసరం. మ్యూజిక్ డైరెక్టర్ గా తన సత్తా ఏంటో చూపించాలంటే ప్రస్తుతం ఒక చార్ట్ బస్టర్ ఇవ్వాల్సిన అవసరం తనకు ఎంతైనా ఉంది.
ఈ పాట హిట్ వారం థమన్ కు ఎంతో అవసరం. మ్యూజిక్ డైరెక్టర్ గా తన సత్తా ఏంటో చూపించాలంటే ప్రస్తుతం ఒక చార్ట్ బస్టర్ ఇవ్వాల్సిన అవసరం తనకు ఎంతైనా ఉంది.
Aditya N
మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు అభిమానులకి స్పెషల్ గిఫ్ట్ గా ‘జరగండి’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేసేందుకు గేమ్ ఛేంజర్ మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ పాట హిట్ వారం థమన్ కు ఎంతో అవసరం. మ్యూజిక్ డైరెక్టర్ గా తన సత్తా ఏంటో చూపించాలంటే ప్రస్తుతం ఒక చార్ట్ బస్టర్ ఇవ్వాల్సిన అవసరం తనకు ఎంతైనా ఉంది. ఇంతకు ముందే ఈ పాట లీక్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కు జరగండి పాట అంతగా నచ్చలేదు.
ఇటీవల తమన్ ఇచ్చే పాటలకు ముందు నెగటివ్ రెస్పాన్స్ రావడం… కొన్ని రోజులయ్యాక మళ్ళీ పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఆయన ఇటీవల సంగీతం అందించిన ‘గుంటూరు కారం’ సినిమా కూడా మహేష్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరచలేకపోయింది. కాకపోతే సినిమా థియేటర్లలో విడుదలైన తరువాత పరిస్థితి మారింది. అయితే ఎంతైనా థమన్ తన రేంజ్ కు తగ్గ అద్భుతమైన ఆల్బమ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి చాలా కాలమైందని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ విషయానికొస్తే ఈ సినిమాకు సంబంధించి బయటకు అధికారికంగా వస్తున్న మొదటి ప్రమోషనల్ కంటెంట్ ‘జరగండి’ పాటనే.
రామ్ చరణ్ అభిమానులు ఎంతోకాలం ఎదురుచూసిన తర్వాత వస్తోంది కాబట్టి ఒక సూపర్ హిట్ సాంగ్ ఇచ్చి వాళ్ళని అలరిస్తే థమన్ ను అందరూ మెచ్చుకుంటారు. కాగా ఈ పాట చరణ్ బర్త్ డే రోజు విడుదల కానుండటంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ పాన్-ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న చిత్రం. ఈ సందర్భంలో, ఆల్బమ్ నుండి వచ్చే మొదటి పాట హిట్ అయితే సినిమా ప్రమోషన్స్ కు మంచి స్టార్ట్ గా ఉంటుంది. గేమ్ ఛేంజర్ షూటింగ్ చాలా రోజుల పాటు జరగడం వల్ల సినిమా మీద హైప్ కాస్త తగ్గింది. మరి ఫస్ట్ సింగిల్ హిట్ అయితే ఖచ్చితంగా ప్రేక్షకులలో సినిమా పై తిరిగి బజ్ క్రియేట్ అవుతుంది. మరి థమన్ ‘జరగండి’ పాట తో రామ్ చరణ్ ఫ్యాన్స్ ని థమన్ అలరించగలరా అనేది ఈ నెల 27 న తెలిసిపోతుంది.
గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ – థమన్ కు బిగ్ టెస్ట్