iDreamPost
android-app
ios-app

గీతాంజలి మళ్ళీ వచ్చింది: కోన వెంకట్ కమ్ బ్యాక్ హిట్‌గా నిలుస్తుందా?

  • Published Feb 26, 2024 | 12:04 PM Updated Updated Feb 26, 2024 | 12:04 PM

గీతాంజలి హారర్ మూవీతో అలరించిన అంజలి. .ఇప్పుడు గీతాంజలి మళ్లీ వచ్చింది అంటూ భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదలై.. మంచి టాక్ తెచ్చుకుంది.

గీతాంజలి హారర్ మూవీతో అలరించిన అంజలి. .ఇప్పుడు గీతాంజలి మళ్లీ వచ్చింది అంటూ భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదలై.. మంచి టాక్ తెచ్చుకుంది.

  • Published Feb 26, 2024 | 12:04 PMUpdated Feb 26, 2024 | 12:04 PM
గీతాంజలి మళ్ళీ వచ్చింది: కోన వెంకట్ కమ్ బ్యాక్ హిట్‌గా నిలుస్తుందా?

ఒకప్పుడు వరుస విజయాలతో రచయితగా స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేసిన కోన వెంకట్ గత కొంత కాలంగా సరైన హిట్ ఇవ్వలేకపోయారు. అయన పేరు చెప్పగానే దూకుడు వంటి ‘బ్లాక్ బస్టర్’ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇక దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. వారిద్దరూ కలిసి చివరిసారిగా పని చేసిన బ్రూస్ లీ పెద్ద ఫ్లాప్ అయింది. అయితే తన బ్యాడ్ ఫెజ్ లో కోన వెంకట్ నిర్మాతగా, రచయితగా పని చేసిన గీతాంజలి మాత్రం సూపర్ హిట్ అయింది. కాగా అదే అయనకు చివరి హిట్ సినిమా. ఇప్పుడు ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని కోన వెంకట్ ప్రయత్నిస్తున్నారు.

గతంలో వచ్చిన హారర్ కామెడీ ‘గీతాంజలి’కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాని కోన వెంకట్ కథ రాసి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ శనివారం విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. బోలెడన్ని పంచ్ లతో సాగిన ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది అని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో విరూపాక్ష, మసూదా వంటి సీరియస్ హారర్ సినిమాలు బాగా ఆడుతుండగా ఇలాంటి హారర్ కామెడీ సినిమాలు ఆడతాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సరైన విధంగా కామెడీ పండితే హారర్ కామెడీ సినిమాలకి ఎప్పుడూ మంచి రెస్పాన్స్ వస్తుంది అని మరో వర్గం ప్రేక్షకులు అంటున్నారు.

గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకి కోన వెంకట్ కేవలం కథ మాత్రమే అందించగా, సామజవరగమన వంటి సూపర్ హిట్ సినిమాకి పని చేసిన భాను, నందు ఈ చిత్రానికి మాటలు రాశారు. మరి వారి కొత్త తరహా రచన సినిమాకి కలిసి వచ్చి మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా కోన వెంకట్ కమ్ బ్యాక్ హిట్ గా నిలుస్తుందని ఆశిద్దాం.