Venkateswarlu
Venky Movie Re Release: వెంకీ సినిమా 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌కు సిద్ధమయింది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. టికెట్లు అన్ని థియేటర్లలో హాటు కేకుల్లా అమ్ముడయ్యాయి.
Venky Movie Re Release: వెంకీ సినిమా 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌కు సిద్ధమయింది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. టికెట్లు అన్ని థియేటర్లలో హాటు కేకుల్లా అమ్ముడయ్యాయి.
Venkateswarlu
2004, మార్చి 24న తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సినిమా విడుదల అయింది. రవితేజ- స్నేహ హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఇందులో పెద్ద గొప్ప లేకపోవచ్చు. సాధారణంగా ఎంత పెద్ద హిట్ సినిమాను అయినా ప్రేక్షకుల నెలల్లో మర్చిపోతూ ఉంటారు. కానీ, వెంకీ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు అవుతున్నా.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు సూపర్ క్రేజ్ వచ్చింది.
వెంకీ సినిమాకు ఇంత క్రేజ్ రావటానికి ప్రధాన కారణంగా అందులోని ట్రైన్ పార్టు. ఆ సీన్ కారణంగానే వెంకీ సినిమా తరచుగా జనాల నోళ్లలో నానుతోంది. వెంకీ మూవీకి ట్రైన్ పార్టు గుండెకాయలాంటిది. జనాలకు ట్రెస్ రిలీఫ్ లాంటిది. సాధారణ జనం దగ్గరినుంచి సెలెబ్రిటీల వరకు తమకు కాస్త మెంటల్ టెన్షన్‌గా ఫీలయినపుడు వెంకీ ట్రైన్ పార్టు చూసి కూల్ అవుతున్నారు. ట్రైన్‌లో రవితేజ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, రామచంద్రల గ్యాంగ్ చేసే హంగామా మామూలుగా ఉండదు.
వీరితో పాటు గజాల పాత్రలో బ్రహ్మానందం, బొక్కా పాత్రలో ఏవీఎస్ కామెడీ కుమ్మేశారు. హీరోయిన్ స్నేహను ఇంప్రెస్ చేయడానికి రవితేజ అతకని అబద్ధాలు ఆడటం.. గజాల, బొక్కాల చేతిలో ఇరుక్కుపోవటం.. తర్వాత చోటు చేసుకునే ఫన్.. పడి పడి నవ్వించేలా చేస్తుంది. శ్రీను వైట్ల, కోన వెంకట్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో వెంకీ ది బెస్ట్ అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వెంకీని ఎన్ని సార్లు చూసినా బోరుకొట్టకుండా అద్భుతంగా తీర్చి దిద్దారు.
కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. సస్పెన్స్ కూడా సినిమాకు హైలెట్. ఇక, డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా రవితేజ, స్నేహను ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు ఆడి నవ్వుల పాలవ్వటం మామూలుగా ఉండదు. వెంకీ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగుంటుంది. అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. చివరకు సినిమా కథను మలుపు తిప్పేది కూడా ట్రైన్ పార్టే కావటం విశేషం..
#Venky4K Hyderabad City Early Morning Shows So Far
Sudharshan 35mm – SOLDOUT
Sandhya 70mm – SOLDOUT
Sandhya 35mm – SOLDOUT
Devi 70mm – SOLDOUT
Viswanath 70mm – SOLDOUT
Bhramaramba 70mm – SOLDOUTAll set to revive the re-release trend if the distributor can garner as many shows… pic.twitter.com/GiBY5CrrhV
— Daily Culture (@DailyCultureYT) December 26, 2023
వెంకీ సినిమా 2004, మార్చి 24 థియేటర్లలోకి వచ్చింది. మూవీ థియేటర్లలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. రీరిలీజ్‌ల హవా నడుస్తున్న ఈ నేపథ్యంలో వెంకీని కూడా రీరిలీజ్‌కు సిద్ధం చేశారు. మూవీ డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లోని ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సుదర్శన్, సంధ్య 70 ఎమ్‌ఎమ్, సంధ్య 30 ఎమ్‌ఎమ్, దేవీ 70 ఎమ్‌ఎమ్, బ్రమరాంభ థియేటర్లలో మార్నింగ్ షో టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి.
ఎందుకూ పనికిరారు అనుకున్న నలుగురు స్నేహితులు అనుకోకుండా పోలీస్ జాబ్‌కు సెలెక్ట్ అవుతారు. ట్రైనింగ్ కోసం ట్రైన్‌లో విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతుంటారు. ఈ సమయంలో ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. తర్వాత ఆ నలుగురు ఆ మర్డర్ కేసునుంచి ఎలా బయటపడ్డారు? ఆ హత్య చేసింది ఎవరు? అన్నదే మిగిలిన కథ. మరి, వెంకీ సినిమా 20 ఏళ్ల తర్వాత కూడా రికార్డులు సృష్టించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.