iDreamPost
android-app
ios-app

‘ఏజెంట్’ ఫ్లాపైనా సురేందర్ రెడ్డికి ఛాన్స్! కావాలనే డేర్ చేస్తున్నారా?

  • Author singhj Published - 10:33 AM, Tue - 10 October 23
  • Author singhj Published - 10:33 AM, Tue - 10 October 23
‘ఏజెంట్’ ఫ్లాపైనా సురేందర్ రెడ్డికి ఛాన్స్! కావాలనే డేర్ చేస్తున్నారా?

సినీ పరిశ్రమలో సక్సెస్​కు ఉన్న విలువేంటో స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. ఎంత ప్రతిభ ఉన్నా విజయాలు లేకుంటే ఇక్కడ నెగ్గుకురావడం కష్టమే. అందుకే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. టాలెంట్​తో పాటు లక్ కూడా తోడైతే ఇండస్ట్రీలో రాకెట్​లా దూసుకుపోవచ్చు. ఒకవేళ అదృష్టం కలసిరాకో తప్పుడు నిర్ణయాల వల్లో ఫెయిల్యూర్స్ వస్తే ఇక్కడ పట్టించుకునేవారే ఉండరు. అయితే టాలెంట్ ఉన్నవారిని ఎంకరేజ్ చేసే వారూ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. ఫెయిల్యూర్స్ ఉన్నా టాలెంట్ ఉందంటే వారిని ప్రోత్సహిస్తుంటారు వెంకీ.

ఇప్పుడో డైరెక్టర్​కు ఛాన్స్ ఇవ్వాలని వెంకటేష్ భావిస్తున్నారట. భారీ డిజాస్టర్​తో రేసులో వెనుకపడిన ఒక దర్శకుడికి వెంకీ బంపరాఫర్ ఇచ్చారట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. సురేందర్ రెడ్డేనని వినికిడి. మెగాస్టార్ చిరంజీవితో సురేందర్ రెడ్డి తీసిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ మంచి వసూళ్లే సాధించింది. కానీ భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాకు ఎక్స్​పెక్ట్ చేసిన రేంజ్​లో కలెక్షన్స్ రాలేదని ట్రేడ్ టాక్. ఆ తర్వాత అక్కినేని వారసుడు అఖిల్​తో ‘ఏజెంట్’ తీశాడు సురేందర్ రెడ్డి. కానీ ఈ చిత్రం పెద్ద డిజాస్టర్​గా నిలిచింది. దీంతో ఆయనకు ఇక అవకాశాలు రావని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ క్యలాణ్​ను డైరెక్ట్ చేసే ఛాన్స్​ సురేందర్​ను వరించింది.

‘ఉస్తాద్ భగత్​సింగ్’, ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘ఓజీ’ మూవీస్​ను పూర్తి చేసే పనుల్లో పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు. దీంతో పవన్-సురేందర్ రెడ్డి మూవీ 2024 సమ్మర్ వరకు పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో సురేందర్ రెడ్డి మరో బంపరాఫర్ దక్కించుకున్నట్లు సమాచారం. విక్టరీ వెంకటేష్ 76వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఆయన్ను వరించిందని ప్రచారం బలంగా జరుగుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్​తో కూడిన ఒక ఎంటర్​టైనింగ్ స్టోరీని ఆ మధ్య వెంకీ, సురేష్ బాబుకు సూరీ చెప్పారట. ఈ కథకు వాళ్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. దీంతో ఈ ప్రాజెక్ట్ త్వరలో కార్యరూపం దాల్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ‘ఏజెంట్’ డిజాస్టర్ అయినప్పటికీ సురేందర్ రెడ్డి మేకింగ్ పై ఉన్న నమ్మకం, కథ నచ్చడంతోనే వెంకటేష్ డేర్ చేస్తున్నారని టాక్.

‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీతో వెంకీ ఒక మూవీకి కమిట్​మెంట్ ఇచ్చారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సినిమా గురించి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కథకు సంబంధించి ఏకాభిప్రాయం రాలేదట. శివ కార్తికేయన్​తో తీసిన ‘ప్రిన్స్’ ఫ్లాప్ కావడంతో వెంకీ కోసం రాసిన స్టోరీ విషయంలో అనుదీప్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని సమాచారం. మరి.. ఈ రెండు సినిమాల్లో వెంకీ దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో? ఏది త్వరగా పట్టాలెక్కుతుందో చూడాలి. కాగా, వెంకటేష్ ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘హిట్’ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ‘సైంధవ్’ను.. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: గోల్డెన్ ఛాన్స్.. ఇప్పటికైనా రెజీనా లక్ మారేనా?

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio