iDreamPost
android-app
ios-app

గోల్డెన్ ఛాన్స్.. ఇప్పటికైనా రెజీనా లక్ మారేనా?

  • Author singhj Updated - 09:07 AM, Tue - 10 October 23
  • Author singhj Updated - 09:07 AM, Tue - 10 October 23
గోల్డెన్ ఛాన్స్.. ఇప్పటికైనా రెజీనా లక్ మారేనా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు ఓవర్​నైట్ స్టార్లు అయిపోతారు. ఒకే ఒక్క సినిమాతో కెరీర్​లో సెటిలైపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. మరికొందరు మాత్రం ఎన్ని మూవీస్ చేసినా ఎదుగూ బొదుగూ ఉండదు. టాలెంట్, కష్టపడేతత్వం ఉన్నా లక్ కలసి రాక రేసులో వెనుకబడిపోతారు. హీరోయిన్ రెజీనాను అదే లిస్టులో చేర్చాల్సి ఉంటుంది. ఆమె సినీ కెరీర్ మొదలై 18 సంవత్సరాలు కావొస్తోంది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు పదేళ్లు అయ్యాయి. అయినా ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్​కు చేరుకోలేదు. అడపాదడపా కొన్ని పెద్ద చిత్రాలు, యంగ్ హీరోస్​తో కలసి నటిస్తున్నా స్టార్ హీరోల మూవీస్​లో మాత్రం అవకాశాలు రావడం లేదు.

ఈ మధ్య ప్రయోగాత్మక చిత్రాలు, లేడీ ఓరియంటెడ్ మూవీస్​, వెబ్ సిరీస్​ల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు రెజీనా. అయితే మొత్తానికి ఆమెకు ఇప్పుడు టైమ్ వచ్చినట్లుంది. ఒక స్టార్ హీరో రెజీనాకు తనతో కలసి నటించే ఛాన్స్ ఇచ్చారని టాక్. కోలీవుడ్ టాప్ హీరో అజిత్ 62వ సినిమా ఎట్టకేలకు ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. ‘విడాముయర్చి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫస్ట్ నుంచి చాలా మార్పులు చేస్తూ వస్తున్నారు. ఈ ఫిల్మ్​ను డైరెక్ట్ చేయడానికి విఘ్నేష్ శివన్ రెడీ అయ్యారు. అయితే ఏవో కారణాల వల్ల ఆయన వైదొలగడంతో ఆ తర్వాత డైరెక్టర్ మగిళ్ తిరుమేణి పేరు తెర మీదకు వచ్చింది.

‘విడాముయర్చి’ సినిమా స్టోరీలో చాలా ఛేంజెస్ జరిగాయని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్ త్రిషతో పాటు బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీ ఇందులో కథానాయికలుగా నటిస్తారని.. అర్జున్ దాస్ విలన్​గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే షూటింగ్ లేట్ కావడంతో అర్జున్ దాస్ ఈ మూవీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దీంతో ఇప్పుడా క్యారెక్టర్​ను నటుడు ఆరవ్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా షూట్ స్టార్ట్ అవుతున్న టైమ్​లో నటి హ్యూమా ఖురేషీ కూడా తప్పుకున్నారు. దీంతో ఆమెకు బదులు రెజీనాను సెలక్ట్ చేశారని సమాచారం. ఒకవేళ ఈ ఆఫర్ ఓకే అయితే మాత్రం లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ సినిమా అయినా రెజీనాకు అవసరమైన బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

ఇదీ చదవండి: బలగం డైరెక్టర్ బాటలో మరో జబర్దస్త్ కమెడియన్!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet